Home » Nara Chandrababu Naidu
జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రాణహాని ఉందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ అన్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల బంధువులు కొందరు జైలు అధికారులుగా వుండడం అనుమానంగా ఉందన్నారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో అక్రమంగా అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుటుంబసభ్యులు కలిశారు.
వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్టకొడుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ( JC Diwakar Reddy ) అన్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఆరోగ్యం గురించి మొదట నుంచి మేము ఆందోళన వ్యక్తపరుస్తున్నామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పట్టాభిరాం ( Pattabhi Ram ) అన్నారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) అక్రమ అరెస్టుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దారుణాలు అన్నీ పక్కదారి పట్టాయని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ( Nannapaneni Rajakumari ) అన్నారు.
ఏసీబీ కోర్టు జడ్జికు టీడీపీ అధినేతే చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జైల్లో భద్రతపై ఉన్న అనుమాలు, అనారోగ్య పరిస్థితి వివరిస్తూ చంద్రబాబు రాసిన లేఖ ఏసీబీ కోర్టుకు అందిందని తెలిపారు.
రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్ ( Shailajanath ) అన్నారు.
మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు అయ్యిందని తెలిసి గర్వ పడ్డానన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై 'నిజం గెలవాలి' అని ప్రజలతో కలిసి పోరాడుతున్నానన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ దాఖలైన పిటిషన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు ఈనెల 31కి రిజర్వ్ చేసింది. ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ పిటిషన్ దాఖలు చేయగా.. నిన్న సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో అచ్చెన్న మాట్లాడుతూ.. జైల్లో వ్యక్తులను చంపేయడంలో జగన్ అండ్ టీం ఎక్సపర్ట్స్ అన్నారు. జైల్లో ఉన్న వాళ్లని సైలెంటుగా చంపేస్తారని.. గతంలో అలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. జైల్లో జరుగుతున్న పరిణామాలు.. చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వ వైఖరితో తమలో ఆందోళన కలుగుతోందని అన్నారు.