AP Highcourt: చంద్రబాబు స్కిల్ కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం
ABN , First Publish Date - 2023-10-30T11:53:17+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ కేస్‌లో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) స్కిల్ కేస్‌లో రెగ్యులర్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సోమవారం హైకోర్టులో (AP High Court) విచారణ ప్రారంభమైంది. వెకేషన్ బెంచ్‌లో న్యాయమూర్తి నాట్ బిఫోర్ మి అనటంతో ఈరోజు రెగ్యులర్ బెంచ్‌లో విచారణకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ లిస్ట్ అయింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి రీత్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని బాబు తరుపు న్యాయవాదులు అడుగుతున్నారు. హెల్త్ రిపోర్ట్‌లను అటాచ్ చేస్తూ చంద్రబాబు తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.