Share News

MLC Kavitha: చంద్రబాబు అక్రమ అరెస్ట్ దురదృష్టకరం

ABN , First Publish Date - 2023-10-28T20:53:37+05:30 IST

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) అక్రమ అరెస్టు దురదృష్టకరమని... ఆయన కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోగలమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) అన్నారు.

MLC Kavitha:  చంద్రబాబు అక్రమ అరెస్ట్ దురదృష్టకరం

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) అక్రమ అరెస్టు దురదృష్టకరమని... ఆయన కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోగలమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం ఇచ్చారు. ఎక్స్ వేదికగా ఆస్క్ కవిత Hashtag ద్వారా నెటిజన్స్ ప్రశ్నలకు ఎమ్మెల్సీ కవిత సమాధానం చెప్పారు. ‘‘ ఈ వయస్సులో చంద్రబాబుకు జరుగుతున్నది దురదృష్టకరం. ఆ కుటుంబం బాధను నేను అర్థం చేసుకున్నాను. కుటుంబ సభ్యులకు నా సానుభూతి. మాకు ఏ పార్టీతో జట్టు లేదు... తెలంగాణ ప్రజలే మా జట్టు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం, కేసీఆర్ ( KCR ) హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం. రాజకీయ కుట్రలో పావును కాను.... ధైర్యంగా కొట్లాడే పటిమ నాకుంది. బీజేపీ (BJP ) బీసీ సీఎం జపం ఎన్నికల గిమ్మిక్కే. బీజేపీ బీసీ రాష్ట్ర అధ్యక్షుడిని తప్పించి అగ్రవర్ణాలకు అప్పగించారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు సర్వేల్లో మాత్రమే గెలుస్తాయి... మేము ఎన్నికల్లో గెలుస్తాం. ద్రోహం చేయడమే తెలంగాణకు కాంగ్రెస్‌కు ఉన్న అనుబంధం. తెలంగాణ అంశాలపై ఒక్కసారైనా పార్లమెంటులో రాహుల్‌గాంధీ ( Rahul Gandhi ) మాట్లాడారా ? రాహుల్‌గాంధీ... ఎన్నికల గాంధీ. ఎన్నికలప్పుడే వస్తారూ... పోతారు. తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర శూన్యం. మహిళా రిజర్వేషన్ల చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిది’’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

Updated Date - 2023-10-28T21:17:07+05:30 IST