Share News

K. Raghavendra Rao: హైటెక్ సిటీ సృష్టి కర్త చంద్రబాబు

ABN , First Publish Date - 2023-10-29T21:43:36+05:30 IST

హైటెక్ సిటీ సృష్టి కర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) అని సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు ( K. Raghavendra Rao ) అన్నారు.

K. Raghavendra Rao: హైటెక్ సిటీ సృష్టి కర్త చంద్రబాబు

హైదరాబాద్: హైటెక్ సిటీ సృష్టి కర్త తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) అని సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు ( K. Raghavendra Rao ) అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. ‘‘ఈ విశ్వనగరాన్ని నిర్మించిన మీకోసం లక్షలాది మంది తరలి రావడాన్ని చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నాను. మీతో ప్రయాణం చేయడం చాలా గర్వంగా ఉంది. అందుకు మీకు కృతజ్ఞుడిని. మీరు ఆరోగ్యంతో నూతన శక్తితో త్వరగా బయటకు రావాలని ఏడుకొండల వాడిని ప్రార్ధిస్తున్నాను’’ అని కె.రాఘవేంద్రరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-29T21:43:36+05:30 IST