Home » Nara Lokesh
విశాఖపట్నం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఉదయం ఆరున్నర గంటలకు సింహాచలం వరాహనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ప్రధాన అర్చకులు, అధికారులు లోకేష్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంత్రి నారా లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ కారు ప్రమాదవశాత్తూ మరో కారును ఢీకొట్టింది. దీంతో రెండు కార్లూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఇద్దరి వాహనాల డ్రైవర్లకు ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తన పాదయాత్రలో ఇచ్చిన తొలి హామీని అమలు చేసేందుకు వచ్చిన మంత్రి లోకేశ్ పర్యటన విజయవంతమైంది.
వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని జగన్ అన్నారని, అది అమలు చేయకపోగా.. రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మంత్రి లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టారని, జైల్లో పెట్టించారని విమర్శించారు. తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా 23 కేసులు పెట్టారని, ఫేక్ జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు.
ఏపీ మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఉదయం 10నుంచి 11గంటల మధ్య బంగారుపాళ్యం గ్రామానికి చేరుకుంటారు. ఎన్నికల హామీ మేరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
యువగళం పాదయాత్రలో భాగంగా ఇచ్చిన తొలి హామీ నెరవేర్చడానికి యువనేత నారా లోకేశ్ గురువారం రాత్రి 11.20 గంటలకు బంగారుపాళ్యం చేరుకున్నారు.
కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని మంత్రి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని వైవీ సుబ్బారెడ్డికి సవాల్ విసిరారు. వైవీ సుబ్బారెడ్డి అహంకార ధోణితో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పింక్ డైమండ్‌ను రాజకీయం చేశారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలనకు100 రోజులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు అంతా ఎవరి బాధ్యతులు వారు చురుగ్గా నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి నారా లోకేశ్ నేడు(గురువారం), రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.
ఇచ్చిన హామీ మేరకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సైనికుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే హామీ నెరవేర్చారని మాజీ సైనికులు గుర్తుచేశారు.
AP Flood Victims: ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అధిక వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.