Home » Narendra Modi
భూములున్న రైతులకు మూడు వాయిదాల్లో ఏటా రూ.6,000 ఇచ్చే పీఎం-కిసాన్ పథకాన్ని 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించారు. శనివారంనాడు 18వ ఇన్స్టాల్మెంట్ కింద ప్రధాని విడుదల చేసిన మొత్తంతో కలిసి ఇంతవరకూ రూ.3.45 లక్షల కోట్లకు పైగా పంపిణీ జరిగింది.
ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. వాశిమ్ జిల్లాలోని మాతా జగదంబ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నవరాత్రులు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గుడిలోని సంప్రదాయిక ఢోల్ను వాయించారు.
దేశంలో సుస్థిర వ్యవసాయానికి ప్రోత్సాహం.. ఆహార భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కోట్లపైగా వ్యయంతో రెండు వ్యవసాయ పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.
పెద్ద పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు రావట్లేదని వాపోతారు నిరుద్యోగులు! ‘మా దగ్గర బోలెడన్ని ఉద్యోగాలున్నాయి.. కానీ, తగిన నైపుణ్యాలున్న అభ్యర్థులే దొరకట్లేదు’ అంటాయి కంపెనీలు!
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ (బుధవారం) మరో ముఖ్యమైన పథకాన్ని ఆవిష్కరించారు.
కాంగ్రెస్ పార్టీ రామమందిర నిర్మాణానికి అడ్డుపడిందని, జమ్మూకశ్మీర్లో సంపూర్ణంగా రాజ్యాంగాన్ని అమలు కానీయలేదని, అసెంబ్లీల్లో, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ పాటించలేదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదని, కేవలం సొంత కుటుంబం కోసమే పనిచేసిందని మోదీ విమర్శించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు న్యూ పుణె మెట్రో సెక్షన్ను ప్రారంభించారు. జిల్లా కోర్డు, స్వర్గేట్ మధ్య నడిచే ఈ భూగర్భ మార్గంతో పుణెలోని అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీనితో పాటు రూ.11,200 కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల శంకుస్థాపన చేసి, జాతికి అంకింతం చేశారు.
న్ కీ బాత్ 114వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. స్వదేశంలో తయారీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా దేశంలోని పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న దుకాణదారుల సహకారంతో ప్రతి రంగానికి ప్రయోజనం చేకూరుతుందని, ఎగుమతులు పెరగడంతో పాటు విదేశీ ..
బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ నేపథ్యంలో శనివారంనాడిక్కడ జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు.
ఒక ముఖ్యమంత్రిగా తాను ప్రధానిని కలుసుకున్నానని, ప్రధానిగా ఆయన తమ వినతులను ఆలకించారని ఎంకే స్టాలిన్ చెప్పారు. ప్రధానంగా ప్రధానికి మూడు వినతలు చేసినట్టు చెప్పారు.