Home » National News
కాంగ్రెస్ ఇస్తున్న హామీలు ఎప్పటికీ నెరవేరమనే విజయం ప్రజల ముందు బహిర్గతమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి రెండూ దెబ్బతిని, మరింత అధ్వాన్న స్థితిలోకి జారిపోతున్నాయని వరుస ట్వీట్లలో మోదీ విమర్శలు గుప్పించారు.
ఎన్సీపీ, శివసేనలో చీలికల తర్వాత మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో పోటీపడుతున్నారు. పార్టీ చీలికల తర్వాత మహారాష్ట్ర రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. శివసేనలోని ఒక వర్గానికి ఏక్నాథ్ షిండే నేతృత్వం వహిస్తుండగా, మరో వర్గానికి ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం వహిస్తున్నారు. ఎన్సీపీ కూడా శరద్ పవార్, అజిత్ పవార్‌గా విడిపోయాయి. ఒకే పార్టీ రెండుగా చీలిపోవడంతో కొన్ని నియోజకవర్గాల్లో..
ఎన్నికల సంఘం తమకు తాము క్లిన్ చిట్ ఇచ్చుకుంటూ సమాధానం ఇచ్చిన తీరు, వాడిన భాష, తమ పార్టీపై చేసిన ఆరోపణల కారణంగా తాము తిరిగి లేఖ రాసినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈసీ ఇదే తరహా వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే తాము న్యాయపరమైన ఆశ్రయం పొందడం మినహా మరో మార్గం లేదని పేర్కొంది.
బహిరంగంగా తనకు మద్దతు తెలిపిన పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్‌కు నవాబ్ మాలిక్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన రుణం తీర్చుకోలేనని అన్నారు. జైలు భయంతో తాను అజిత్ పవార్‌తో కలవలేదని, జైలుకు వెళ్లేందుకు తాను ఎప్పుడూ భయపడలేదని చెప్పారు.
'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని గుర్తుచేశారు.
అక్టోబర్ 21న భారత్, చైనా మధ్య బలగాల ఉపసంహరణ, పెట్రోలింగ్ పునరుద్ధణకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం అక్టోబర్ 29లోగా బలగాల ఉపసంహరణ పూర్తి కావాల్సి ఉండగా, ఇరువర్గాలు తమ మౌలిక సదుపాయాలను తొలగించి వెనక్కి మళ్లాయి.
బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. కారు ఆపమంటే.. ఆపలేదని ఓ వ్యక్తి ఆగ్రహించాడు. ఆ కారును వెండించాడు. అనంతరం కారుకు అడ్డంగా బైక్ నిలిపాడు. ఆ తర్వాత కారు కిటికి అద్దాలను పగల కొట్టాడు. ఈ ఘటనలో కారులోని బాలుడి తలకు తీవ్ర గాయమైంది.
2019 నామినేషన్లో ఆయన తన వయస్సును 42 ఏళ్లుగా చెప్పుకోగా, ఈ ఏడాది దాఖలు చేసిన అఫిడవిట్లో 49 ఏళ్లుగా డిక్లేర్ చేయడం పలు ప్రశ్నలకు , విమర్శలకు దారితీసింది. దీనిపై ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.
ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో హెచ్ఐవీ కలకలం రేగింది. కేవలం ఐదు నెలల్లోనే 20 మందికి ఈ వ్యాది సోకింది. దీంతో స్థానికంగా కలకలం మొదలైంది. ప్రతి ఏటా 20 హెచ్ఐవీ కేసులు నమోదు అయ్యేవని.. కానీ ఐదు నెలల్లోనే ఆ కేసులు నమోదు కావడం.. తాజా పరిస్థితికి అద్దం పడుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నియోమ్. ఎర్ర సముద్రం ఉత్తర ప్రాంతంలో సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నిర్మిస్తున్న కలల ప్రాజెక్టు. ‘సౌదీ విజన్-2030’ పేరుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 2017 నుంచి నిర్మాణంలో ఉంది.