Congr Letter Ec: మాపై వాడిన భాష బాగోలేదు.. ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఘాటు లేఖ
ABN , Publish Date - Nov 01 , 2024 | 08:19 PM
ఎన్నికల సంఘం తమకు తాము క్లిన్ చిట్ ఇచ్చుకుంటూ సమాధానం ఇచ్చిన తీరు, వాడిన భాష, తమ పార్టీపై చేసిన ఆరోపణల కారణంగా తాము తిరిగి లేఖ రాసినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈసీ ఇదే తరహా వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే తాము న్యాయపరమైన ఆశ్రయం పొందడం మినహా మరో మార్గం లేదని పేర్కొంది.
న్యూఢిల్లీ: హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్, ఈసీ మధ్య వివాదం కొనసాగుతోంది. హర్యానా ఎన్నికల్లో తామ లేవనెత్తిన అభ్యంతరాలను ఈసీ తోసిపుచ్చడంతో పాటు, తమకు తాము క్లీ్న్ చిట్ ఇచ్చుకోవడం తమకెంత మాత్రం ఆశ్చర్యం కలిగించ లేదని పేర్కొంది. శతాధిక పార్టీగా తమకున్న స్వతంత్రతను పక్కనపెట్టడమే లక్ష్యంగా ఈసీ వ్యవహరించడం మాత్రం సరికాదని తెలిపింది. ఈమేరకు ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ లేఖ రాసింది.
Shaina NC : మహిళా అభ్యర్థిపై 'ఇంపోర్టెడ్ మాల్' వ్యాఖ్యలు.. చిక్కుల్లో ఎంపీ
హర్యానా ఎన్నికల చిచ్చు...
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, ఇందుకు భిన్నంగా బీజేపీ మెజారిటీ మార్క్‌ను దాటుతూ అనూహ్య ఫలితాలు సాధించింది. ఈవీఎంలు, వాడిని బ్యాటరీలు, ఈసీ వెబ్‌సైట్‌లో ఫలితాలు ఆలస్యంగా రావడంపై పలు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని పోలింగ్ జరుగుతుండగానే కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆ ఆరోపణలను ఈసీ వెంటనే తోసిపుచ్చింది. దీనిపై ఇటీవల మరింత వివరణ ఇస్తూ, కాంగ్రెస్ తమకు అనుకూలంగా ఫలితాలు రానప్పుడు ఇలాంటి బాధ్యతారహితమైన ఆరోపణలే చేస్తుందని విమర్శించింది. హర్యానా ఎన్నికల్లో అవకతలంటూ నిరాధారమైన, తప్పుదారి పట్టించే ఆరోపణలు చేసిందని తప్పుపట్టింది. ఇలాంటి పనికిమాలిన ఫిర్యాదులు చేసే ధోరణి మార్చుకోవాలని పేర్కొంది.
ఈసీ భాష నచ్చకే
ఎన్నికల సంఘం తమకు తాము క్లిన్ చిట్ ఇచ్చుకుంటూ సమాధానం ఇచ్చిన తీరు, వాడిన భాష, తమ పార్టీపై చేసిన ఆరోపణల కారణంగా తాము తిరిగి లేఖ రాసినట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈసీ ఇదే తరహా వ్యాఖ్యలు చేసుకుంటూ పోతే తాము న్యాయపరమైన ఆశ్రయం పొందడం మినహా మరో మార్గం లేదని పేర్కొంది.
కాగా, ఈసీ లేఖను కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్దిష్టమైన 20 ఫిర్యాదుల్లో ఒక్కదానికి కూడా ఈసీ సమాధానం ఇవ్వలేదని ఆయన అన్నారు. తనకు తాను ఈసీ క్లీన్ చిట్ ఇచ్చుకుంటే అక్కడే ఆ విషయాన్ని విడిచిపెట్టేవాళ్లమని అన్నారు. అయితే ఈసీ వాడిన భాష, స్వరం, కాంగ్రెస్‌పై ఆరోపణల నేపథ్యంలో తాము కౌంటర్ రెస్సాన్ (లెటర్) ఇవ్వాల్సివచ్చందన్నారు.
ఇవి కూడా చదవండి...
Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం
PM Modi: చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
For National News And Telugu News...