Share News

Shaina NC : మహిళా అభ్యర్థిపై 'ఇంపోర్టెడ్ మాల్' వ్యాఖ్యలు.. చిక్కుల్లో ఎంపీ

ABN , Publish Date - Nov 01 , 2024 | 05:40 PM

'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్‌సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని గుర్తుచేశారు.

Shaina NC : మహిళా అభ్యర్థిపై 'ఇంపోర్టెడ్ మాల్' వ్యాఖ్యలు.. చిక్కుల్లో ఎంపీ

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) ప్రచారంలో విమర్శల దాడి తీవ్రమవుతోంది. ఎన్నికలకు ముందు బీజీపీని వీడి ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిన షైన ఎన్‌‌సీ (Shina NC)పై అనుచిత వ్యాఖ్యల వివాదంలో ఉద్ధవ్ థాకరే (UBT) ఎంపీ అరవింద్ సావత్ (Arvind Sawant) చిక్కుకున్నారు. ఆమెను 'ఇంపోర్టెడ్ మాల్' (Imported Maal) అంటూ సంబోధించడం ఈ విదానికి కారణమైంది. ఆయన వ్యాఖ్యలపై షైన ఎన్‌సీ అభ్యంతరం తెలిపారు. ఆ పార్టీ (శివసేన యూబీటీ) మానసిక స్థితిని ఎంపీ వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో షిండే శివసేన అభ్యర్థిగా ముంబాదేవి నియోజకవర్గం నుంచి షైన ఎన్‌సీ పోటీ చేస్తు్న్నారు.

Ladakh: డెమ్‌చోక్‌లో భారత బలగాల పెట్రోలింగ్ షురూ


వివాదం ఇలా..

సావంత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఆమె (షైన ఎన్‌సీ) ఇటీవల వరకూ బీజేపీలో ఉన్నారని, అక్కడ టిక్కెట్ రాకపోవడంతో మరో పార్టీలోకి వెళ్లారని చెప్పారు. ''ఇక్కడ దిగుమతి సరుకులను అంగీకరించరు. ఒరిజనల్ వస్తువులనే ఆదరిస్తారు. మావి ఒరిజనల్ గూడ్స్'' అని వ్యాఖ్యానించారు.


మహిళా గౌరవంపై దాడి..

కాగా, 'ఇంపోర్ట్ మాల్' అంటూ సావంత్ మాట్లాడటంపై షైన ఎన్‌సీ అభ్యంతరం తెలిపారు. మహిళల గౌరవంపై జరుపుతున్న దాడిగా దీనిని పేర్కొన్నారు. శివసేన (యూబీటీ) నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశించారు. గతంలో సావంత్ తనను కూడా ప్రచారం కోసం తీసుకువెళ్లారని, ఇప్పుడు నేను ఇంపోర్టెడ్ మాల్‌గా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు. ముంబాదేవిలో ప్రతి మహిళను ఆయన 'మాల్'గానే చూస్తారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్న మహిళలపై గౌరవం లేకుండా మాట్లాడం మంచిది కాదన్నారు. ''నేను మహిళను. మాల్‌ని కాదు. నగడా పోలీస్ స్టేషన్‌లో మీపై ఫిర్యాదు చేస్తాను'' అని అన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆమె నాగ్‌పద పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అరవింద్ సావంత్‌పై ఫిర్యాదు చేశారు.


సావంత్ ప్రతిస్పందన

కాగా, షైన ఎన్‌సీ స్పందనపై అరవింద్ సావంత్ తిరిగి స్పందించారు. రెండ్రోజుల క్రితం తాను మాట్లాడానని, ఈ రెండ్రోజులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. మహిళలంటే తనకు గౌరవమని, తాను బాలాసాహెబ్ సేన నుంచి వచ్చానని చెప్పారు. తన వ్యాఖ్యలను ఆమె తప్పుగా అర్ధం చేసుకున్నారని, తనకెలాంటి చెడు ఉద్దేశాలు లేవని అన్నారు. ఫిర్యాదు చేసుకుంటే చేసుకోవచ్చని చెప్పారు.


ఇవి కూడా చదవండి...

Diwali 2024: దీపావళి ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో గాలి నాణ్యత మరింత విషపూరితం

PM Modi: చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

For National News And Telugu News...

Updated Date - Nov 01 , 2024 | 05:51 PM