Home » NCP
శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీని చీల్చి, బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపిన అజిత్ పవార్ మంగళవారం నూతన కార్యాలయంలోకి ప్రవేశించాలని అనుకున్నారు. అయితే ఆ బంగళా తాళాలు కనిపించకపోవడంతో నేతలంతా బంగళా వెలుపల కూర్చోవలసి వచ్చింది. తాళాల కోసం అనేక మందికి ఫోన్లు చేశారు. ఎట్టకేలకు ప్రవేశ మార్గంలోని తలుపు తాళాన్ని తొలగించగలిగినప్పటికీ, బంగళా లోపలి గదుల తాళాలు దొరకలేదు.
మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరికాసేపట్లో సమావేశం కాబోతున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) కార్యదర్శి హెచ్‌కే పాటిల్ ఈ సమావేశానికి హాజరవుతారు. శాసన సభలో ప్రతిపక్ష నేత పదవిపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ ఈ పదవికి శుక్రవారం రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.
పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నేతలపై నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ క్రమశిక్షణా చర్యలకు దిగారు. ముగ్గురు నేతలను పార్టీ నుంచి తొలగించారు.
అజిత్ పవార్(Ajit Pawar) తిరుగుబాటుపై ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. అన్ని ప్రతిపక్ష పార్టీలను బీజేపీ(BJP) నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.
నేషనల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలతో అజిత్ పవార్ బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో ఆదివారంనాడు చేరడం, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంపై ఎన్‌సీపీ చీఫ్, మరాఠా దిగ్గజ నేత శరద్ పవార్ మండిపడ్డారు. ఇదేమీ గుగ్లీ కాదని, రాబరీ అని అన్నారు. అయితే, ఇలాంటివేమీ తనకు కొత్త కాదని చెప్పారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను తీసుకుని అధికార బీజేపీ-శివసేన కూటమి ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ మరో బాంబు పేల్చారు. ఎన్సీపీ పేరు, పార్టీ గుర్తు తమవేనని ప్రకటించుకున్నారు. ఎన్సీపీ గుర్తుతోనే భవిష్యత్తులో ఎన్నికకు వెళ్తామని చెప్పారు.
మహారాష్ట్రలో ఆదివారం రాజకీయంగా అతి పెద్ద సంచలనం నమోదైంది. మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌పై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, ప్రత్యర్థి పక్షంతో చేతులు కలిపారు. బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్‌తోపాటు ఎన్సీపీలో ప్రముఖ నేత చగన్ భుజ్‌బల్ కూడా బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపారు.
మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు ఆయన సమీప బంధువు అజిత్ పవార్ గట్టి ఝలక్ ఇచ్చినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది.
శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లో ఇటీవల తలెత్తిన లుకలుకలన్నీ సద్దుమణిగాయని అనుకుంటున్న తరుణంలో మరో కీలక పరిణామం చేటుచేసుకుంది. తనకు అసెంబ్లీలో ఎన్సీపీ విపక్ష నేత పదవిపై ఆసక్తి లేదని, పార్టీ బాధ్యత అప్పగించమని అధిష్ఠానాన్ని పవార్ మేనల్లుడు, ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ కోరారు.