Maharashtra : ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2023-07-02T14:48:40+05:30 IST
మహారాష్ట్రలో ఆదివారం రాజకీయంగా అతి పెద్ద సంచలనం నమోదైంది. మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌పై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, ప్రత్యర్థి పక్షంతో చేతులు కలిపారు. బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్‌తోపాటు ఎన్‌సీపీలో ప్రముఖ నేత చగన్ భుజ్‌బల్ కూడా బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపారు.
ముంబై : మహారాష్ట్రలో ఆదివారం రాజకీయంగా అతి పెద్ద సంచలనం నమోదైంది. మరాఠా రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌పై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, ప్రత్యర్థి పక్షంతో చేతులు కలిపారు. బీజేపీ-శివసేన కూటమితో కలిసి ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్‌తోపాటు ఎన్‌సీపీలో ప్రముఖ నేత చగన్ భుజ్‌బల్ కూడా బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపారు.
ఆదివారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటల ప్రాంతంలో అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు ఆయన వర్గానికి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. వీరిలో ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్ కూడా ఉన్నారు. అజిత్ పవార్ నాలుగేళ్లలో మూడోసారి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు.
అజిత్ పవార్ తిరుగుబాటుతో శరద్ పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఇవి కూడా చదవండి :
Manipur violence : మణిపూర్ హింసాకాండ వెనుక విదేశీ శక్తులు : సీఎం బిరేన్ సింగ్