Home » NCP
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధికారం చేపట్టేందుకు అధికార, విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరితోపాటు రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. ఆ క్రమంలో విపక్ష మహావికాస్ అఘాడి కూటమిలో కుమ్ములాటలు ప్రారంభమయ్యేలా ఉన్నాయి.
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పశ్చాత్తాపపడుతున్నారా? ఎన్నికల్లో తప్పు చేశానని ఫీల్ అవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో తాను పెద్ద తప్పు చేశానని అన్నారు.
సైబర్ కేసులు ఇటీవల కాలంలో పెరిగి పోతున్నాయి. నేరగాళ్ల బారిన ప్రముఖ వ్యక్తులు పడుతున్నారు. నంబర్ తీసుకొని, బెదిరిస్తున్నారు. భయపడ్డారో ఇక అంతే సంగతులు. ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలే కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. ఆమె వాట్సాప్ నంబర్ హ్యాకయ్యింది. సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. 400 డాలర్లు పంపించాలని కోరారట. మన కరెన్సీలో రూ.32 వేలు పంపించాలని అడిగారట. అకౌంట్ నంబర్ కూడా పంపించారని సుప్రియా సూలే వివరించారు.
ముఖ్యమంత్రి పదవికి ఎవరినీ అభ్యర్థిగా ప్రకటించకుండా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడదామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.
కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆమె వాట్సాప్‌ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇదే విషయాన్ని సుప్రియా సూలే ఎక్స్‌వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని..
మహారాష్ట్ర ఎన్నికల వేళ రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికల వ్యుహాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. మరట్వాడా కోటా అంశం ప్రధాన పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన మధ్య వివాదం నెలకొంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, ఎన్సీపీ(ఎస్పీ) నేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ల మధ్య రాజకీయం వేడెక్కింది. ఇటీవల మహారాష్ట్రలోని పుణెలో జరిగిన బీజేపీ సదస్సులో శరద్ పవార్‌ను ఉద్దేశించి ‘అవినీతి చక్రవర్తి’ అని షా వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం భేటీ అయ్యారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో వారిద్దరూ సమావేశమయ్యారు.
మహారాష్ట్ర(maharashtra)లో మరోసారి డ్రంక్ అండ్ డ్రైవ్(drunk and drive) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పూణెలోని మంజ్రీ ముంధ్వా రోడ్డులో కోళ్లతో వెళ్తున్న టెంపోను ఎదురుగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది(accident). మద్యం మత్తులో ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మాజీ NCP కార్పొరేటర్ బందు గైక్వాడ్ కుమారుడు కావడం విశేషం.
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీ సీట్లు దారుణంగా పడిపోవడానికి అజిత్ పవార్ ఎన్సీపీతో కమలనాథులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడమే కారణమా?. అవునని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుంబంధ మరాఠీ వీక్లీ 'వివేక్' ఒక రిపోర్ట్‌లో తెలిపింది.