Share News

Sayaji Shinde: నటుడు షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం

ABN , Publish Date - Oct 11 , 2024 | 08:06 PM

చాలాకాలంగా తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఆ కారణంగానే ఈ సిస్టమ్ (రాజకీయాలు)లోకి వచ్చానని షాయాజీ షిండే చెప్పారు. తన సామాజిక సేవ కొనసాగుతుందని తెలిపారు.

Sayaji Shinde: నటుడు షాయాజీ షిండే రాజకీయ అరంగేట్రం

ముంబై: బహుభాషా నటుడు షాయాజీ షిండే (Sayaji Shinde) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అజిత్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)లో శుక్రవారంనాడు చేరారు. నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో ఆయన ఎన్‌సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. అజిత్ పవార్ సమక్షంలో ఎన్‌సీపీలో షిండే చేరారు.

Jammu And Kashmir: ప్రభుత్వం ఏర్పాటుకు బేషరతుగా ఎన్‌సీకి కాంగ్రెస్ మద్దతు


రాజకీయాల్లోకి ఎందుకంటే?

చాలాకాలంగా తాను సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఆ కారణంగానే ఈ సిస్టమ్ (రాజకీయాలు)లోకి వచ్చానని చెప్పారు. తన సామాజిక సేవ కొనసాగుతుందని తెలిపారు. అజిత్ పవార్‌పై ప్రశంసలు కురిపిస్తూ, ఆయన పార్టీ సిద్ధాంతాలు తనను ఆకర్షించడం వల్లే ఎన్‌సీపీలో చేరానని చెప్పారు.


''రాజకీయ నేతగా చాలా సినిమాల్లో నటించాను. అయితే ఇంతవరకూ రాజకీయనేత కాలేదు. నేను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే నన్ను ఆలోచింప చేశాయి. రాజకీయాల్లోకి అడుగుపెడితే మరింత మంచి సేవ చేయవచ్చని అనిపించింది. ఆ కారణంగానే రాజకీయాల్లోకి వచ్చాను. అజిత్ పవార్ ఎన్‌సీపీ విధానాలు నచ్చాయి. లాడ్లీ బెహనా యోజనా పేద మహిళలకు అండగా నిలుస్తోంది. రాజకీయాల్లోకి రావడం వెనుక నాకు ఎలాంటి స్వార్ధం లేదు'' అని షిండే చెప్పారు.


For National News And Telugu News

ఇది కూడా చదవండి...

PM Modi: దసరా ఉత్సవాల వేళ.. అమ్మవారి కిరీటం చోరీ

Updated Date - Oct 11 , 2024 | 08:06 PM