Share News

National Politics: మహారాష్ట్ర పర్యటనలో అమిత్‌ షా.. సీట్ల లెక్కలు తేలుస్తారా..

ABN , Publish Date - Sep 09 , 2024 | 08:27 AM

మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా..

National Politics: మహారాష్ట్ర పర్యటనలో అమిత్‌ షా.. సీట్ల లెక్కలు తేలుస్తారా..
Amit Shah

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారు. మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 30 స్థానాలు గెలుచుకోగా.. ఎన్డీయే కూటమి 17 స్థానాలను గెలుచుకుంది. ఒక లోక్‌సభ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఈ ఫలితాలు బీజేపీని తీవ్ర నిరాశపర్చాయి. అధికారంలో ఉన్నప్పటికీ ఆశించిన సీట్లు గెలవలేకపోయారు. ఎన్సీపీ, శివసేనలో చీలిక తీసుకొచ్చినా ఎన్డీయే కూటమి 17 స్థానాలకే పరిమితమవ్వడంతో బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఈ ఫలితాలపై బీజేపీ అధిష్టానం వెంటనే సమీక్ష చేపట్టింది. మహారాష్ట్రలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనకు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ఆదివారం అమిత్ షా పార్టీ సీనియర్ నేతలతో పాటు సీఎం ఏక్‌నాధ్ షిండేను కలిశారు.

Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ


సీట్ల లెక్కలు తేలుస్తారా..

ఎన్నికలకు ముందు అమిత్ షా ముంబై పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం ముంబై చేరుకున్న అమిత్ షాను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కలిశారు. అమిత్ షా కాన్వాయ్ ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌కు చేరుకున్న తర్వాత.. ఆయన బీజేపీ కీలక నేతలతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో కూటమి ఓటమిపై కొద్దిసేపు కీలక నేతలతో సమీక్షించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ ఏడాది నవంబర్‌లో జరిగే శాసనసభ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. సోమవారం కూడా అమిత్ షా పార్టీ సీనియర్లతో పాటు.. భాగస్వామ్య పక్షాల నాయకులతో సమావేశమై ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలో దిశానిర్దేశం చేయనున్నారు.

Elections: అందరి టార్గెట్ జమ్మూకశ్మీర్.. బీజేపీ ఆరో జాబితా విడుదల


150 నుంచి 170

288 మంది శాసనసభ్యులు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో 150 నుంచి 170 స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. 70 నుంచి 100 శివసేనకు, 30 నుంచి 50 ఎన్సీపీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సోమవారం అమిత్ షా లాల్‌బాగ్చా వినాయకుడిని దర్శించుకుంటారు. అలాగే సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇళ్లను సందర్శించే అవకాశం ఉంది.


National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు నడ్డా సలహా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Sep 09 , 2024 | 08:27 AM