Uddhav Thackeray: ఉద్దవ్ కారుపై ఆవు పేడతో దాడి..
ABN , Publish Date - Aug 11 , 2024 | 09:40 AM
మహారాష్ట్ర ఎన్నికల వేళ రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికల వ్యుహాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. మరట్వాడా కోటా అంశం ప్రధాన పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన మధ్య వివాదం నెలకొంది.
థానే: మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రంజుగా మారాయి. ఎన్నికల వ్యుహాల్లో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. మరట్వాడా కోటా అంశం ప్రధాన పార్టీలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన మధ్య వివాదం నెలకొంది.
దాడి.. ప్రతిదాడి
ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ థాకరే శుక్రవారం మధ్య మహారాష్ట్రలో పర్యటించారు. రాజ్ థాకరే కారుపై కొందరు టమాటాలతో దాడి చేశారు. దాంతో ఎమ్మెన్నెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాజ్ థాకరేపై దాడి జరిగిన మరుసటి రోజు శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ థాకరే కారుపై దాడి చేశారు. థానేలో ఉద్దవ్ కారుపై కొబ్బరి కాయలు, ఆవు పేడను విసిరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఉద్దవ్ థాకరేకు రాజ్ థాకరే కజిన్ అవుతారు. ఉద్దవ్ తండ్రి బాల్ థాకరే ఉన్నప్పుడే రాజ్ థాకరే ఎమ్మెన్నెస్ పార్టీని ఏర్పాటు చేశారు.
అలర్లకు కుట్ర
‘నా మరట్వాడా పర్యటనను అడ్డుకుంటే రాష్ట్రంలో ఏ ఒక్క ర్యాలీ జరగనీయ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరట్వాడా కోటా పేరుతో అల్లర్లు సృష్టించాలని ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ చూస్తున్నారు. ఆ క్రమంలోనే మరట్వాడా కోటా నేత మనోజ్ జరాంగేను పావుగా వాడుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి అని’ రాజ్ థాకరే సూచించారు.
Read More National News and Latest Telugu News