Home » NDA Alliance
‘మోదీ 3.0’ సర్కారు ఆదివారం కొలుదీరింది. దేశ ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ, 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 32 మంది సహాయ మంత్రులు కలుపుకొని మొత్తం 72 మంది ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇక్కడి వరకు ఓకే.. అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సర్వత్రా వినిపిస్తున్న ఆసక్తికరమైన ప్రశ్న లోక్‌సభ స్పీకర్ ఎవరు?.
కేంద్రంలో మోదీ(PM Modi) ప్రభుత్వం మూడోసారి కొలువుదీరిన తరుణంలో ప్రతిపక్షాలు ఆయన సర్కార్‌పై విరుచుకుపడుతున్నాయి. మిత్రపక్షాల సాయంతో కొలువుదీరిన సంకీర్ణ సర్కార్.. ఏడాదిలో కూలిపోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి...
రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకార మహోత్సవం జూన్ 9న ఘనంగా జరిగింది. 2014లో మోదీ తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పటి తర్వాత కేబినెట్లో ఒకే ఒక్క మహిళా మంత్రి ఉండేవారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడోసారి ‘మోదీ 3.0 ప్రభుత్వం’ కొలువుదీరింది. మోదీ రికార్డు స్థాయిలో 3వ సారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీతో పాటు మంత్రి మండలిని ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో వరుసగా మూడు సార్లు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమానం చేశారు. ఇక మోదీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు.
ప్రధాని మోదీ కేబినెట్ ప్రమాణ స్వీకర కార్యక్రమం ఢిల్లీలోని రాష్ర్టపతి భవన్లో ఘనంగా జరుతోంది. మోదీ మంత్రి వర్గంలో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు భాగం కానున్నారు.
భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది.
కేంద్రంలో బీజీపీ పార్టీకి అనుకున్న విధంగా ఫలితాలు రాకపోవడంతో ఆ పార్టీ కీలక నేతలు ఆందోళనలో ఉన్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiam Srihari) అన్నారు. ఇప్పటికైనా బీజీపీ నాయకులు ఎగిరెగిరి పడటం మానుకొని దేశం, రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం తగ్గిందన్నారు.
‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అవ్వాతాతల ఆప్యాయత, అక్కచెల్లెమ్మల అనురాగం ఏమైపోయింది? ఆధారాలు లేవు కనుక ఏదో జరిగిందని చెప్పడం లేదు’’... ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత..
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 4వ సారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేయనున్నారు.