Share News

Modi 3.0 Cabinet swearing-in Live Updates: దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ

ABN , First Publish Date - Jun 09 , 2024 | 06:03 PM

భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది.

Modi 3.0 Cabinet swearing-in Live Updates: దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ
Narendra Modi 3.0

Live News & Update

  • 2024-06-09T21:15:33+05:30

    • కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రమాణస్వీకారం చేశారు

    • కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన బీజేపీ నేత

  • 2024-06-09T20:59:42+05:30

    • కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్

    • గుంటూరు ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచిన ఎంపీ

    • ఎంపీగా గెలిచిన తొలిసారే వరించిన కేంద్ర మంత్రి పదవి

  • 2024-06-09T20:44:29+05:30

    ప్రమాణస్వీకారం చేసిన కేంద్ర మంత్రుల జాబితా..

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు పూర్తి కేబినెట్ కూడా ప్రమాణస్వీకారం చేసింది. కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారి జాబితా ఇదే.. రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ ఖట్టర్‌, హెచ్‌డీ కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, జేడీయూ నేత రాజీవ్ రంజన్, సర్బానంద సోనోవాల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ వీరేంద్ర కుమార్, జుయల్ ఓరమ్, ప్రహ్లాద్ జోషి, అశ్విని వైష్ణవ్, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్‌, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణా దేవి, కిరణ్ రిజిజు, మన్సుఖ్ మాండవియా, హర్దీప్ సింగ్ పూరి, చిరాగ్ పాశ్వాన్, సీఆర్ పాటిల్, జీ కిషన్ రెడ్డి, తదితరులు.

  • 2024-06-09T20:22:09+05:30

    కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సికింద్రాబాద్ ఎంపీ జీ.కిషన్ రెడ్డి

  • 2024-06-09T20:01:15+05:30

    • కేంద్ర కేబినెట్ మంత్రిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మాహన్ నాయుడు ప్రమాణస్వీకారం చేశారు

    • శ్రీకాకుళం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు

  • 2024-06-09T19:59:06+05:30

    • వరుసగా మూడు సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండవ వ్యక్తిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.

    • అంతకుముందు జవహర్ లాల్ నెహ్రూ 1952, 1957, 1962 ఎన్నికల్లో గెలిచి వరుసగా మూడు సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

      Untitled-8.jpg

  • 2024-06-09T19:48:42+05:30

    కేంద్ర కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, మనోహర్ లాల్ ఖట్టర్, హెడ్‌డీ కుమారస్వామి, శివరాజ్ సింగ్ చౌహాన్, ఎస్ జైశంకర్, పీయూష్ గోయెల్.

  • 2024-06-09T19:32:47+05:30

    • దేశ ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ వరుసగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

    Untitled-8.jpg

  • 2024-06-09T19:27:59+05:30

    • భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది.

  • 2024-06-09T19:25:26+05:30

    దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్న మోదీ

  • 2024-06-09T19:20:58+05:30

    • ప్రముఖులతో కిక్కిరిసిన రాష్ట్రపతి భవన్.. భారీగా భద్రతా ఏర్పాట్లు

    • మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్

      Untitled-8.jpg

  • 2024-06-09T19:14:42+05:30

    • రాష్ట్రపతి భవన్‌‌కు చేరుకున్న నరేంద్ర మోదీ

    • కొద్ది క్షణాల్లో ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం

  • 2024-06-09T19:12:50+05:30

    మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, మారిషస్ ప్రవీంద్ కుమార్, ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు మహ్మద మొయిజ్జు సహా మొత్తం ఏడు దేశాల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • 2024-06-09T19:01:10+05:30

    Untitled-7.jpg

    మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

    మోదీ 3.0 ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. రాజ్యాంగ బాధ్యతల కారణంగా తాను ఈ కార్యక్రమానికి హాజరయ్యానని, తాను రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నానని, ఈ కార్యక్రమానికి హాజరవ్వడం తన బాధ్యత అని ఖర్గే అన్నారు. నరేంద్ర మోదీని అభినందిస్తారా అని ప్రశ్నించగా.. తాను కలిస్తే చూస్తానని ఖర్గే సమాధానం ఇచ్చారు.

  • 2024-06-09T18:58:49+05:30

    • మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

    • విచ్చేసిన రజనీ కాంత్, కంగనా రనౌత్, అనంత్ అంబానీ

  • 2024-06-09T18:44:00+05:30

    • భార్య అన్నా లెజ్నోవాతో కలిసి ‘మోదీ 3.0’ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన జనసేన అధినేత పవన్ కల్యాణ్

  • 2024-06-09T18:43:10+05:30

    మోదీ 3.0 ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్

  • 2024-06-09T18:36:49+05:30

    • రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న అమిత్ షా, పలువురు బీజేపీ సీనియర్ నాయకులు

    • ఆశీనులైన నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పూరీ, శివరాజ్ సింగ్ చౌహాన్, జితన్ రామ్ మాంఝీ, జయంత్ సింగ్ చౌదరి, శోభా కరంద్లాజే, ఎస్ జైశంకర్

    • మా మద్దతు ఎన్డీయేకే. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు: అజిత్ పవార్

  • 2024-06-09T18:25:47+05:30

    • కేంద్ర సహాయమంత్రి పదవి ఆఫర్ చేయడంపై పెదవి విరిచిన ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్

    • గతంలో తాను కేబినెట్ మంత్రిగా పనిచేశానని ఎన్‌సీపీ నాయకుడు

    • ఇది తను డీమోషన్ ఇవ్వడమేనని వ్యాఖ్య

  • 2024-06-09T18:23:11+05:30

    • మరోసారి కేంద్రమంత్రి పదవి ఇచ్చినందుకు నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

  • 2024-06-09T18:21:34+05:30

    • ప్రమాణస్వీకారం కార్యక్రమం జరుగుతున్న రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణానికి అతిరథ మహారథులు విచ్చేశారు

    • ఒక్కొక్కరుగా చేరుకుంటున్న బీజేపీ, ఎన్డీయే పక్షాలకు చెందిన నాయకులు

  • 2024-06-09T18:10:10+05:30

    మంత్రి పదవులు దక్కనుంది వీరికేనా?

    పలువురు నేతలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయంటూ జాతీయ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ జాబితా ఇదే...

    1. నితిన్ గడ్కరీ (బీజేపీ)

    2. జ్యోతిరాదిత్య సింధియా (బీజేపీ)

    3. శివరాజ్ సింగ్ చౌహాన్ (బీజేపీ)

    4. పీయూష్ గోయల్ (బీజేపీ)

    5. గిరిరాజ్ సింగ్ (బీజేపీ)

    6. కమల్జీత్ సెహ్రావత్ (బీజేపీ)

    7. జార్జ్ కురియన్ (బీజేపీ)

    8. రవనీత్ సింగ్ బిట్టు (బీజేపీ)

    9. జీ. కిషన్ రెడ్డి (బీజేపీ)

    10. బండి సంజయ్ కుమార్ (బీజేపీ)

    11. సీఆర్ పాటిల్ (బీజేపీ)

    12. లల్లన్ సింగ్ (జేడీయూ

    13. రాందాస్ అథవాలే (ఆర్‌పీఐ)

    14. రక్షా ఖడ్సే (బీజేపీ)

    15. ప్రతాపరావు జాదవ్ (షిండే- శివసేన)

    16. వీ. సోమన్న (బీజేపీ)

    17. భూపతి రాజు శ్రీనివాస వర్మ (బీజేపీ)

    18. రాజ్ భూషణ్ నిషాద్ (బీజేపీ)

    19. సతీష్ చంద్ర దూబే (బీజేపీ)

    20. నిముబెన్ జయంతి భాయ్ బంభానియా (బీజేపీ)

    21. నిర్మలా సీతారామన్ (బీజేపీ)

    22. డాక్టర్ ఎస్ జైశంకర్ (బీజేపీ)

    23. రామ్మోహన్ నాయుడు (టీడీపీ)

    24. పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ)

  • 2024-06-09T18:01:31+05:30

    యావత్ భావతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోదీ 3.0 పట్టాభిషేకానికి (Modi 3.0 Govt swearing-in LIVE) సమయం ఆసన్నమైంది. సర్వసిద్ధమైంది. మరికొద్ది సేపట్లోనే అంటే సరిగ్గా రాత్రి 7.15 గంటలకు భారత ప్రధానిగా ముచ్చటగా మూడవసారి ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం...