Home » NDA
రాఖీ పండుగ సందర్భంగా ముస్లింలకు చేరువ కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ముస్లింల కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, వారి అభివృద్ధి కోసం చట్టాలను తీసుకొచ్చిందని తెలిపారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏ క్షణంలోనైనా తిరిగి ఎన్‌డీఏలోకి వస్తారంటూ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ మోదీ తోసిపుచ్చారు. ఆయన రావాలనుకున్నా బీజేపీ అందుకు సిద్ధంగా లేదని చెప్పారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరనున్నారా? అవుననే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ఎన్డీయేలోకి నితీష్ రానున్నారంటూ కేంద్రం మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలను తాజాగా జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్ బలపరిచారు.
తెగల మధ్య ఘర్షణలతో సాధారణ జన జీవనం అస్తవ్యస్తంగా మారిన మణిపూర్‌లో సాధారణ స్థితిని సత్వరమే పునరుద్ధరించాలని మణిపూర్ గవర్నర్ అనుసుయియా యూకీ (Governor Anusuiya Uikey)ని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు కోరారు. రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించి, సహాయక శిబిరాల్లోని బాధితులతో మాట్లాడారు.
విపక్షాల కూటమి ఇండియా ఏర్పాటుకు మొదట్నించీ విస్తృతంగా కసరత్తు చేస్తూ, ఇటీవల పాట్నాలో కూటమి సమావేశానికి ఆతిథ్యమిచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రామ్‌దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ ఏ క్షణంలోనైనా ఎన్డీయేలో చేరుతారని, నితీష్ తమ వాడని అన్నారు.
నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం, దీనికి సభాపతి ఓం బిర్లా అనుమతి ఇవ్వడంతో ఎవరి బలాబలాలు ఎలా ఉన్నాయనే చర్చ మొదలైంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం లేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం నోటీసులను లోక్‌సభలో సమర్పించాయి. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు ఈ నోటీసులను ఇచ్చారు. వీటిని బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభ సభాపతి ఓం బిర్లా పరిశీలిస్తారు.
ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్-యూసీసీ) అంశంపై ముస్లిం మత పెద్దలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. అయితే.. ఈ సమావేశంలో UCC అంశంపై సీఎం జగన్ ఎటూ తేల్చకపోవడం గమనార్హం. ఈ బిల్లుతో ముస్లింలకు నష్టం కలిగితే వ్యతిరేకిస్తామని జగన్ చెప్పినప్పటికీ, UCCపై స్పష్టంగా హామీ ఇవ్వాలంటూ ముస్లిం మత పెద్దలు కోరినా సీఎం జగన్ సమాధానం ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.
రాబోయే ఎన్నికల్లో పవన్ చరిష్మాను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోంది. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే గత ఎన్నికల కంటే రెండు శాతం ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఓట్ల శాతాన్ని పెంచుకోవడానికి, జగన్‌ను ఓడించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అంతంత మాత్రమే. జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేయకపోవడానికి ఆయనతో ఉన్న సత్సంబంధాలే కారణం కావచ్చు.
వచ్చే 25 ఏళ్లలో ఎన్డీఏ (NDA) దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (Pm Narendra Modi) అన్నారు.