Home » Nellore politics
AP Politics 2024: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఎన్నికల నోటిఫికేషన్‌కు చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టికెట్లు దక్కని.. అసంతృప్తు నేతలు, ఆశావహులు జంపింగ్‌లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మరీ ముఖ్యంగా అధికార వైసీపీలో సిట్టింగులకు టికెట్లు రాకపోవడంతో అటు టీడీపీ.. ఇటు జనసేన కండువాలు కప్పేసుకుంటున్నారు. ఇప్పుడుంతా జంపింగ్‌లే జరుగుతున్నాయి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(CM YS Jagan) టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ(Narayana) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేస్తారో చేసుకోండి అంటూ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. నెల్లూరులో బుధవారం మీడియాతో మాట్లాడిన నారాయణ.. ‘నీ రైడ్స్‌కి భయపడను. ఎన్ని సార్లు రైడ్స్ చేస్తారో చేసుకోండి.
AP Elections 2024: విజయసాయిరెడ్డి.. వైసీపీలో (YSR Congress) కీలక నేతగా.. పార్టీలో నంబర్-02గా వ్యవహరిస్తూ వస్తున్నారు.! రెండోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు.! ఇలా సాయిరెడ్డి (Vijayasai Reddy).. జగన్ (YS Jagan Reddy) బాగు కోరుతుంటే.. జగన్ మాత్రం విజయసాయిని బలి పశువున చేశారనే ఆరోపణలు సొంత పార్టీ నుంచి వెల్లువెత్తుతున్న పరిస్థితి...
AP Assembly Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికార వైసీపీకి ( YSR Congress) వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ షాక్‌ల నుంచి తేరుకోకమునుపే ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీని వీడుతుండటంతో హైకమాండ్ విలవిల్లాడుతోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.. మరికొందరు క్యూలో ఉన్నారు కూడా..
AP Elections 2024 : అనిల్ కుమార్ యాదవ్.. (Anil Kumar Yadav) నెల్లూరు సిటీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు.. అయితే ఈ ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా బరిలోకి దిగబోతున్నారు. ఇటీవల వైసీపీ ప్రకటించిన జాబితాతో క్లియర్ కట్‌గా తేలిపోయింది. వైసీపీ (YSRCP) హైకమాండ్ అనిల్‌ను ఎందుకు ఇక్కడ్నుంచి పోటీ చేయిస్తోందో..? గెలుపు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే సంగతి దేవుడెరుగు..? అవన్నీ ఇక్కడ అనవసరం. అనిల్ స్థానంలో ఎవరు పోటీ చేయబోతున్నారు..? సీఎం జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) మనసులో ఎవరున్నారు..? అనేది ఇప్పుడు నెల్లూరు సిటీలో (Nellore City) జరుగుతున్న చర్చ..
ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంటే మొదటి వారంలోనే లక్షాముప్పైవేల ఎకరాల దోపిడీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే అనం రామనారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీలో మూడు నెలలుగా ఉన్న చిక్కుముడి ఎట్టకేలకు వీడిపోయింది. చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్‌ల మధ్య సయోధ్య కుదిర్చారు.
అనిల్ వ్యతిరేక వర్గీయులుగా ముద్ర పడ్డ రూప్‌కుమార్, ముక్కాల ద్వారకానాథ్‌లు పార్టీలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అనిల్ వ్యవహారశైలి ఏ మాత్రం మింగుడుపడని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు రూప్‌కుమార్ తదితరులకు ఆశీస్సులందిస్తున్నారు.
ఓ వైపు పెరుగుతున్న తిరుగుబాట్లు.. మరోవైపు ఎంత ప్రయత్నించినా తిరుగుబాటుదార్లపై పడని వేటు.. ఈ రెండూ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను కుంగదీస్తున్నాయి. ఒకప్పుడు సీఎం జగన్‌కు వీర విధేయుడిగా ఉన్న అనిల్ మాట ఇప్పుడు చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో (Nellore Politics) ఊహించని పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? టీడీపీలో (Telugudesam) చేరేందుకు ఎమ్మెల్యేకు (MLA) లైన్ క్లియర్ అయ్యిందా..? 40 ఏళ్లుగా ఒకరంటే ఒకరు పడని..