YSRCP: వైసీపీలో ముసలానికి ఆ ఒక్కడే కారణమా...
ABN , Publish Date - Jan 19 , 2025 | 12:36 PM
YSRCP: నెల్లూరులో వైసీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తీరుపై మత్స్యకార నేతలు తిరుబాట వేశారు. ఈ విషయంలో వైసీపీ హే కమాండ్‌తో తాడో పేడో తేల్చుకోడానికి సిద్ధమయ్యారు.

నెల్లూరు: కావలి వైసీపీలో ముసలం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి తీరుపై మత్స్యకార నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మండల అధ్యక్షుడి పదవిని రూ.50లక్షలకు అమ్మారని ఆరోపణలు వచ్చాయి. పలువురు నేతలకు రామిరెడ్డి ఫోన్ చేసి బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మలపెంట సముద్ర తీరం వద్ద వైసీపీ మత్స్యకార నేతలు, ఎంపీటీసీలు, సర్పంచులు సమావేశం జరిగింది. రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ నాయకత్వంలో పనిచేయకూడదని మత్స్యకార నేతలు నిర్ణయం తీసుకున్నారు. జగన్‌ను కలిసి అమీతుమీ తేల్చుకోవాలని చర్చల్లో మత్స్యకార నేతలు వారి వాదాన్ని బలంగా వినిపించారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి కీలక నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ సీనియర్ నేతలు. ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకున్న నేతలు సైతం ఇప్పుడు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సిద్ధమవడం ఏంటి.. ఆల్రెడీ కొందరు ముఖ్య నేతలు పార్టీ వీడగా.. మరికొందరు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కావలిలో వైసీపీ నేతల పరిస్థితి మళ్లీ చర్చనీయాంశంగా మారడంతో ఆ పార్టీ హై కమాండ్ తల పట్టుకుంటుంది.