Home » New Delhi
ఢిల్లీ ఓల్డ్ రాజేంద్ర నగర్లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి వరద నీరు ముంచెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై బాధ్యులను ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు చీవాట్లు పెట్టింది. ఢిల్లీ ప్రభుత్వ ''ఉచితాల సంస్కృతి''ని తప్పుపట్టింది.
న్యూఢిల్లీలో వరద నీటిలో చిక్కుకుని మృతి చెందిన సివిల్స్ విద్యార్థులకు భద్రత కల్పించే విషయంలో కోచింగ్ సెంటర్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయని బిహార్ ఎంపీ పప్పు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతులు ముగ్గురని ప్రకటించినప్పటికి ఆ సంఖ్య మరింత ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
వరద నీరు పోటెత్తి ఓల్డ్ రాజేంద్రనగర్లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లోకి రావడంతో ముగ్గురు సివిల్ ఆశావహులు మృతి చెందిన ఘటన సంచలనం కావడంతో ఢిల్లీ మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాజేంద్ర నగర్ ఏరియాలో బుల్డోజర్ చర్యలకు దిగింది.
న్యూఢిల్లీలో వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో న్యూఢిల్లీలో మౌలిక సదుపాయాల సరిగ్గా లేవని.. అందువల్లే ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు అయితే సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.
వెస్ట్ డిల్లీ రాజేందర్ నగర్లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోడానికి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్వాతి మలివాల్ మండిపడ్డారు. ఈ మరణాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినవి కావని, ఇది 'హత్యే'గానే తాను భావిస్తున్నాని అన్నారు.
సెంట్రల్ ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించడం, విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో పోలీసులు తక్షణ చర్యలకు దిగారు. స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్ను ఆదివారంనాడు అదుపులోనికి తీసుకున్నారు.
క్రిమినల్ చట్టాలను ప్రభుత్వాలు కట్టుదిట్టం చేస్తున్నా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారంనాడు ఇదే తరహా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక టీనేజ్ అమ్మాయిపై బిల్డర్ చేయి చేసుకున్నాడు. ఒళ్లు తెలియని ఆవేశంతో ఆమె చెంప పగడకొట్టడంతో ఒక్కసారిగా ఆమె బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన 'నీతి ఆయోగ్' 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో శనివారంనాడు జరుగనుంది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఈ సమావేశం జరుగుతుందని శుక్రవారంనాడు ఒక అధికార ప్రకటన వెలువడింది.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో న్యూఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త కార్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. స్థానిక లుటియన్స్ ప్రాంతం.. పండిట్ రవి శంకర్ శుక్లా లేన్లో బంగ్లా నెం1ను ఆప్కి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టే 2024-25 బడ్జెట్లో ఢిల్లీకి రూ.350 కోట్లకు మించి కేటాయించరని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ జోస్యం చెప్పారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మంగళవారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానంతరం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.