Share News

Dussehra: రావణదహనానికి విల్లుపట్టిన ముర్ము, మోదీ

ABN , Publish Date - Oct 12 , 2024 | 06:44 PM

దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. దేశరాజధానిలోని మాదవ్ దాస్ పార్క్‌లో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

Dussehra: రావణదహనానికి విల్లుపట్టిన ముర్ము, మోదీ

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విజయదశమి (Vijayadashami) వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. దేశరాజధానిలోని మాదవ్ దాస్ పార్క్‌లో శ్రీ ధార్మిక్ లీలా కమిటీ నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా నిర్వహించిన 'రావణదహన్' కార్యక్రమంలో వీరిరువురూ విల్లు చేతపట్టి శరసంధానం చేశారు. దీనికి ముందు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి వేదిక వద్దకు చేరుకోగానే రామలక్ష్మణ వేషధారులకు తిలకం దిద్దారు.

Rajnath singh: జవాన్లతో కలిసి ఆయుధపూజ చేసిన రాజ్‌నాథ్ సింగ్


నవరాత్రుల చివరిరోజున విజయదశమి (దసరా)ని ఏటా ఎంతో వైభవంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంటారు. ఇందుకు సంబంధించిన పురాణగాథలు కూడా చాలానే ఉన్నాయి. దుష్టుడైన రావణాసురుని రాముడు యుద్ధంలో ఓడించిన రోజును విజయదశమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దసరా పండుగతోనే దీపావళి సన్నాహాలు కూడా మొదలవుతాయి. విజయదశమి వెళ్లిన 20 రోజులకు దీపావళి వేడకను అత్యంత వైభవంగా దేశప్రజలు జరుపుకుంటారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Haryana: హర్యానాలో కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకార తేదీలో ట్విస్ట్

Updated Date - Oct 12 , 2024 | 06:47 PM