Home » New Delhi
పార్లమెంటు ఉభయసభల్లో సభ్యులు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులు అడ్డుపడరాదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఆదివారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ఈ అప్పీల్ చేశారు.
పార్లమెంటు వర్షాకాల బడ్జెట్ సమావేశాలు ఈనెల 22వ తేదీ సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లోని మెయిన్ కమిటీ రూమ్‌లో ఆదివారంనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభలకు చెందిన ఫ్లోర్ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాలకు లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కోరింది...
జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ కుమార్ తనకు పోర్న్ వీడియోలు చూపి లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఆ సంస్థ వ్యవస్థాపకుడు నవీన్ జిందాల్‌కు ‘ఎక్స్’ వేదికగా ఫిర్యాదు చేశారు. విమానంలో తన పట్ల జరిగిన దారుణాన్ని ఆమె ఓ పోస్టులో వివరించారు. ‘
ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడం, రిమాండ్‌కు పంపడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు రిజర్వ్ చేసింది. తాత్కాలిక బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది.
హర్యానా, పంజాబ్‌లను వేరుచేస్తూ శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన దిగ్బంధాలను హర్యానా ప్రభుత్వం తొలగించడంతో మరోసారి రైతులు ఢిల్లీకి ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జంతర్‌మంతర్‌లో కానీ, రామ్‌లీలా మైదానంలో కానీ శాంతియుత నిరసనలకు దిగుతామని భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు జగ్జీత్ సింగ్ దలేవాల్ మంగళవారం తెలిపారు.
దేశంలో సాగును మరింత సుదృఢం చేసేందుకుగాను 100 కొత్త రకాల విత్తనాలను, సాగు పరంగా మరో వంద సాంకేతిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చేందుకు భారత వ్యవసాయ పరిశోధక సంస్థ (ఐసీఏఆర్) సంకల్పించింది.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.
పరువు నష్టం కేసులో హక్కుల కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్ కు ఢిల్లీ సాకేత్ కోర్టు 5 నెలల జైలు శిక్ష విధించింది. పిటిషనర్ వీకే సక్సేనాకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.
గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీ మహానగరగం అతలాకుతలమవుంది. ఆ క్రమంలో ఎక్కడి వర్షపు నీరు అక్కడ నిలిచిపోయింది.
పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు.