Home » New Delhi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనతో సహా తన మంత్రివర్గ సహచరుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారంనాడు అందజేశారు. రాష్ట్రపతి భవన్కు మోదీ స్వయంగా వెళ్లి రాజీనామాలను సమర్పించారు. అందుకు అంగీకరించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం జరిగేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో 17వ లోక్సభ రద్దుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారంనాడు సిఫారసు చేసింది. ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 16వ తేదీతో ముగియనుంది. మేదీ 2.0 చివరి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికారంలో ఉన్న 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP), ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు చక్రం తిప్పి, గత ఎన్నికల్లోనూ గట్టి ఉనికిని చాటుకున్న మాయావతి సారధ్యంలోని బీఎస్పీకి 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు వెలువడనున్న నేపథ్యంలో కొత్త ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార వేదిక వద్ద చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఏజెన్సీలు దృష్టి సారిస్తున్నాయి. ఈ వారాంతంలోనే ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండొచ్చని చెబుతున్నారు.
'ఎగ్జిట్ పోల్' ఫలితాలను కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ ఈనెల 4న జరిగే ఓట్ల లెక్కింపుపై భారీ అంచనాలతో ఉంది. ఇందులో భాగంగా 'ఇండియా' కూటమి నేతలను ఆ పార్టీ అప్రమత్తం చేసింది. మంగళవారం రాత్రి కౌటింగ్ పూర్తయ్యేంత వరకూ లేదా బుధవారం ఉదయం 5 గంటల వరకూ అంతా ఢిల్లీలోనే ఉండాలని కూటమి సీనియర్ నేతలకు విజ్ఞప్తి చేసింది.
ఎక్సైజ్ పాలసీ కేసు నిందితుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహారు జైలు అధికారులకు లొంగిపోయారు. వెంటనే ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు డిప్యూటీ జడ్జి సంజీవ్ అగర్వార్ ముందు హాజరుపరిచారు. ఈనెల 5వ తేదీ వరకూ కేజ్రీవాల్కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
సుదీర్ఘంగా సాగిన ఏడు దశల లోక్సభ ఎన్నికల పోలింగ్ చివరి ఘట్టం మరి కాసేపట్లో ముగియనుండటంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో 'ఇండియా' కూటమి నేతలు శనివారంనాడు సమావేశమయ్యారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుపై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించారు.
సుప్రీంకోర్టు గత నెలలో మంజూరు చేసిన మధ్యంతర బెయిలును పొడిగించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న దరఖాస్తుపై తీర్పును ఢిల్లీ కోర్టు ఈనెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో ఈనెల 2వ తేదీన తిరిగి తీహార్ జైలు అధికారుల ముందు కేజ్రీవాల్ లొంగిపోవడం అనివార్యం కానుంది.
దేశ రాజధాని 'నీటి సంక్షోభం'తో అల్లాడుతోంది. తక్షణం ఆదుకోవాలంటూ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ను ఢిల్లీ నీటిపారుదల శాఖ మంత్రి అతిషి కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రికి శుక్రవారంనాడు ఆమె లేఖ రాశారు.
ఢిల్లీలో ఓ వ్యక్తి (40) వడ దెబ్బ కారణంగా దుర్మరణం చెందాడు. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీలు చేరడంతో అవయవాలన్నీ విఫలమై కన్నుమూశాడు.