Home » Nirmala Sitharaman
దేశ ఆర్థిక వ్యవస్థ చిట్టాగా భావిస్తున్న కేంద్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది.
యావత్ దేశం ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 కోసం ఎదురుచూస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న ఈ బడ్జెట్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలావుండగా వరుసగా ఆరవసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక రికార్డును సొంతం చేసుకోనున్నారు
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే మదుపర్లు బడ్జెట్ 2024 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దాదాపు ప్రతి ఏడాది బడ్జెట్(Budget 2024) సమయంలో స్టాక్ మార్కెట్లలో పలు రకాల స్టాక్స్ పెద్ద ఎత్తున పుంజుకుంటాయి. ఆ క్రమంలో పెట్టుబడిదారులకు మంచి లాభాలు లభిస్తాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏ స్టాక్స్ లాభాల్లో దూసుకెళ్తాయి. ఏవి నష్టాల్లో ఉంటాయనేది ఇప్పుడు చుద్దాం.
మరికొన్ని రోజుల్లో దేశంలో మధ్యంతర బడ్జెట్ 2024ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో అసలు బడ్జెట్ అంటే ఏమిటీ, ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది. ఎప్పటి నుంచి బడ్జెట్ అమలు చేస్తున్నారనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర బడ్జెట్ అనగానే మనకు కేంద్ర ఆర్థిక మంత్రి, ఆ తర్వాత బ్రీఫ్‌కేస్ గుర్తుకొస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ మొత్తం ఆ బ్రీఫ్కేసులోనే ఉందని చెబుతుంటారు. అయితే గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన బ్రీఫ్‌కేస్ విధానం నుంచి ప్రస్తుతం ట్యాబ్ స్థాయికి ఎలా వచ్చింది. దాని సంగతులేంటనేది ఇప్పుడు చుద్దాం.
మరికొన్ని రోజుల్లో ఈ ప్రభుత్వ చివరి బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తారు.
మన దేశ బడ్జెట్‌ను ఎలా తయారు చేస్తారు. దాని ఉద్దేశం ఏమిటి, దీనిని ఎందుకోసం తయారు చేస్తారనే విషయాలు అనేక మందికి తెలియదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం. ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత పరిస్థితులు, దేశంలో ద్రవ్యోల్బణం కొనసాగుతున్న వేళ అందరి దృష్టి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఉంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2024-25ను సమర్పించనున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నందున మధ్యంతర బడ్జెట్ 2024ను ప్రవేశపెట్టనున్నారు. ఇది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉంటుంది. ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో ఏడు ప్రాధాన్యతా రంగాలను ప్రస్తావించనున్నారు.
బడ్జెట్ అనగానే సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే కార్పొరేట్ సంస్థల వరకు అనేక ఆశలను పెట్టుకుంటారు. ఉద్యోగుల పన్ను మినహాయింపు, కార్పొరేట్ ట్యాక్స్ సహా తమ రాష్ట్రాలకు ఏదైనా ప్రత్యేక కేటాయింపులు చేస్తారని ఆసక్తితో చూస్తారు. అయితే ఇటివల వచ్చిన సమాచారం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కేంద్ర బడ్జెట్ 2024 సమర్పణకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ ప్రభుత్వం 2024 మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే రాబోయే బడ్జెట్లో ఏ పన్నుల విషయంలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.