Budget 2024: ఈ ఏడాది ఆర్థిక సర్వేను సమర్పిస్తారా లేదా..ఆ వివరాలేంటీ?
ABN , Publish Date - Jan 26 , 2024 | 11:31 AM
మరికొన్ని రోజుల్లో ఈ ప్రభుత్వ చివరి బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తారు.
మరికొన్ని రోజుల్లో ఈ ప్రభుత్వ చివరి బడ్జెట్ 2024-25ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2024న బడ్జెట్‌ను సమర్పించనున్నారు. అయితే ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్‌ను సమర్పిస్తారు. ఆర్థిక సర్వే దీనికి ఒక రోజు ముందు అంటే 31 జనవరి 2024 సర్వే సమర్పించబడుతుంది. అయితే పార్లమెంటరీ కన్వెన్షన్ ప్రకారం ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో ఉంటే మధ్యంతర బడ్జెట్(Budget 2024)కు ముందు ఆర్థిక సర్వేను అందించకూడదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వార్షిక ఆర్థిక నివేదికను సమర్పించే ముందు మాత్రమే సర్వేను సిద్ధం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో గత ఏడాది ఈ సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన పలు అంచనాలను ఇప్పుడు చుద్దాం.
మూడో ఆర్థిక వ్యవస్థ
అయితే అంతకుముందు సమర్పించిన 2023 సర్వే వివరాల్లో ప్రధాన అంశాలను ఇప్పుడు చుద్దాం. గత ఆర్థిక సర్వే ప్రకారం ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలను బట్టి GDP 2023-24లో 6 నుంచి 6.8% పరిధిలో ఉంటుందని అంచనా వేసింది. రాబోయే సంవత్సరంలో వృద్ధికి దేశీయ డిమాండ్, మూలధన పెట్టుబడులు పెరగడం ద్వారా మద్దతు లభిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. మరోవైపు కొనుగోలు శక్తి ప్రకారం భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ మారకపు ధరలలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Budget 2024: బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది?
తగ్గిన నిరుద్యోగం?
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తుల పట్టణ నిరుద్యోగిత రేటు సెప్టెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో 9.8 శాతం నుంచి ఒక సంవత్సరం తరువాత (సెప్టెంబర్ 2022 తో ముగిసిన త్రైమాసికంలో) 8.8 శాతానికి తగ్గింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MNREGA), రోజువారీ వేతన ఉపాధిని సృష్టించడంతోపాటు, వ్యక్తిగత కుటుంబాలు వారి ఆదాయ వనరులను స్థిరపరచడంతోపాటు ఇది అనుబంధ ఆదాయంగా ఉపయోగపడుతుంది. దీంతోపాటు గ్రామీణ జనాభాలో సగం మంది ఉన్న కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే PM KISAN, PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన వంటి పథకాలు దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో దోహదపడ్డాయి.
సేవల రంగం
FY22లో 8.4% (YoY) నుంచి FY23లో సేవల రంగం 9.1% వద్ద వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. PMI సేవలలో బలమైన విస్తరణ, సేవా రంగ కార్యకలాపాల సూచన జూలై 2022 నుంచి పరిశీలించారు. ప్రపంచ వాణిజ్య సేవల ఎగుమతులలో దాని వాటా 2015లో 3 శాతం నుంచి 2021లో 4 శాతానికి పెరగడంతో 2021లో టాప్ టెన్ సేవలను ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం ఒకటిగా ఉందని ప్రకటించారు.
వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్
వ్యవసాయం, అనుబంధ రంగాల పనితీరు గత కొన్ని సంవత్సరాలుగా మెరుగ్గా ఉంది. వీటిలో పంట, పశువుల ఉత్పాదకతను పెంపొందించడానికి, మద్దతు ధర ద్వారా రైతులకు రాబడిని నిర్ధారించడానికి, పంటను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఉందని సర్వే తెలిపింది. 2020-21లో వ్యవసాయంలో ప్రైవేట్ పెట్టుబడి 9.3%కి పెరిగింది. 2018 నుంచి అన్ని తప్పనిసరి పంటలకు MSP భారతదేశపు సగటు ఉత్పత్తి వ్యయం కంటే 1.5 రెట్లు నిర్ణయించబడింది. 2021-22లో వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణం 18.6 లక్షల కోట్లకు చేరింది. భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి స్థిరమైన పెరుగుదలను నమోదు చేయగా..2021-22లో 315.7 మిలియన్ టన్నులకు చేరుకుంది. జనవరి 1, 2023 నుంచి ఒక సంవత్సరం పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద సుమారు 81.4 కోట్ల మంది లబ్ధిదారులకు ఉచిత ఆహారధాన్యాలు పంపిణీ చేస్తున్నారు
వాతావరణ మార్పులు, పర్యావరణ అంశాలు
దేశంలో నికర ఉద్గారాల లక్ష్యాన్ని 2070 నాటికి సున్నా స్థాయిని సాధించాలని భారతదేశం ప్రకటించింది. 2030 కంటే ముందే శిలాజ రహిత ఇంధనాల నుంచి 40 శాతం స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించాలనే లక్ష్యాన్ని కూడా ప్రకటించారు. భారతదేశం తన GDP ఉద్గారాల తీవ్రతను 2005 స్థాయి నుంచి 2030 నాటికి 45% తగ్గించుకోవాలి. 2047 నాటికి దేశంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ స్వతంత్రంగా పనిచేసే విధంగా సిద్ధమవ్వాలి.