Share News

Budget 2024: ఈ బడ్జెట్‌లో వీటిపై ప్రకటనలు వచ్చే ఛాన్స్!

ABN , Publish Date - Jan 26 , 2024 | 11:56 AM

బడ్జెట్ అనగానే సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే కార్పొరేట్ సంస్థల వరకు అనేక ఆశలను పెట్టుకుంటారు. ఉద్యోగుల పన్ను మినహాయింపు, కార్పొరేట్ ట్యాక్స్ సహా తమ రాష్ట్రాలకు ఏదైనా ప్రత్యేక కేటాయింపులు చేస్తారని ఆసక్తితో చూస్తారు. అయితే ఇటివల వచ్చిన సమాచారం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Budget 2024: ఈ బడ్జెట్‌లో వీటిపై ప్రకటనలు వచ్చే ఛాన్స్!

బడ్జెట్ అనగానే సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే కార్పొరేట్ సంస్థల వరకు అనేక ఆశలను పెట్టుకుంటారు. ఉద్యోగుల పన్ను మినహాయింపు, కార్పొరేట్ ట్యాక్స్ సహా తమ రాష్ట్రాలకు ఏదైనా ప్రత్యేక కేటాయింపులు చేస్తారని ఆసక్తితో చూస్తారు. అయితే ఇటివల వచ్చిన సమాచారం ప్రకారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని తెలిసింది.

మోదీ ప్రభుత్వం రెండోసారి చివరి బడ్జెట్‌(Budget 2024)ను ఫిబ్రవరి 1న సమర్పించబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి దీనిని సమర్పించనున్నారు. ఇది ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెట్టబోతున్న మధ్యంతర బడ్జెట్. అయితే ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేయాల్సిన అభివృద్ధికి బ్లూప్రింట్‌ను సమర్పించనున్నారు. పేదలకు, యువతకు, రైతులకు, మహిళలకు ఈసారి ప్రభుత్వ బడ్జెట్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆర్థిక నిపుణలు చెబుతున్నారు. బడ్జెట్‌లో వీటికి సంబంధించి కీలక ప్రకటనలు రావచ్చని అంటున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.


బడ్జెట్‌ 2024లో రానున్న కీలక ప్రకటనలు

-రైతులకు పంటలతో పాటు ఆరోగ్య బీమా, జీవిత బీమా కల్పించే అవకాశం

-మహిళలకు బడ్జెట్ కేటాయింపులు పెంచవచ్చు. గత 10 ఏళ్లలో కేటాయింపులు 30% పెరిగాయి.

-ఇంటి కోసం వడ్డీ రాయితీ స్కీం ప్రకటించే ఛాన్స్

-ఎన్‌పీఎస్‌ని ఆకర్షణీయంగా మార్చే సామాజిక భద్రతను పెంచడంపై దృష్టి సారింపు

-స్వచ్ఛమైన ఇంధనం, కాలుష్యం తగ్గింపు చర్యలు ప్రకటించే అవకాశం

-సుస్థిర వ్యవసాయం కోసం చేపట్టిన కార్యక్రమాల ద్వారా విద్య, ఆరోగ్య సంరక్షణకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం

-పరిశ్రమలకు ప్రోత్సాహాకాలు ఇచ్చే ఛాన్స్

-రత్నాలు & ఆభరణాలు, మెడ్‌టెక్, ఐటి వంటి రంగాలకు ప్రత్యేక మద్దతు

-కిసాన్ సమ్మాన్ నిధి పెంపు బడ్జెట్‌లో సాధ్యమే, సమ్మాన్ నిధిని రూ.8000 నుంచి రూ.9000కి పెంచే అవకాశం

-మహిళల కోసం ప్రత్యక్ష నగదు బదిలీ వంటి పథకాలు

-మహిళా రైతులకు సమ్మాన్ నిధి రూ.12 వేల వరకు పెంచే అవకాశం

-మహిళలు MNREGA కోసం ప్రత్యేక రిజర్వేషన్ లేదా గౌరవ వేతనం ఇచ్చే ఛాన్స్

-మహిళలకు వడ్డీలేని రుణాలు అందించే అవకాశం

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Budget 2024: అసలు బడ్జెట్ ఎలా తయారు చేస్తారు, దీని లక్ష్యం ఏమిటి?

ఇక పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కొనసాగనున్నాయి. రాష్ట్రపతి ప్రసంగం జనవరి 31న జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి సంయుక్తంగా ప్రసంగిస్తారు. బడ్జెట్ సెషన్‌లో రాష్ట్రపతి ప్రసంగం అనంతరం జనవరి 31న ఆర్థిక సర్వే నివేదికను కూడా సమర్పించనున్నారు. ఆర్థిక సర్వే అనేది ఒక అకౌంటింగ్ లాంటిది, దీనిలో దేశంలోని గత ఒక సంవత్సరపు ఖాతాల ఆధారంగా వచ్చే ఏడాది బడ్జెట్‌ను సిద్ధం చేయడానికి రూపురేఖలు నిర్ణయించబడతాయి. దీని ఆధారంగా గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో అంచనా వేస్తున్నారు.

Updated Date - Jan 26 , 2024 | 01:44 PM