Share News

Budget 2024: 'బడ్జెట్' అనే పదం ఎక్కడ నుండి వచ్చింది?.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

ABN , Publish Date - Jan 29 , 2024 | 03:49 PM

దేశ ఆర్థిక వ్యవస్థ చిట్టాగా భావిస్తున్న కేంద్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది.

Budget 2024: 'బడ్జెట్' అనే పదం ఎక్కడ నుండి వచ్చింది?.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం..

దేశ ఆర్థిక వ్యవస్థ చిట్టాగా భావిస్తున్న కేంద్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. మోదీ ప్రభుత్వ హయాంలో ఇదే చివరి బడ్జెట్‌ కావడం గమనార్హం. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బడ్జెట్ అనేది ఆంగ్ల పదం ఫ్రెంచ్ పదం బౌజెట్ నుంచి వచ్చింది. బౌజెట్ అనే పదం బౌజ్ నుంచి వచ్చింది. దీనికి లెదర్ బ్రీఫ్‌కేస్ అని అర్థం.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019లో తన మొదటి బడ్జెట్‌ను సమర్పించినప్పుడు బ్రీఫ్‌కేస్ విధానానికి స్వస్తి పలికారు. ఎరుపు లెడ్జర్‌లో బడ్జెట్‌ను సమర్పించాడు. భారత బడ్జెట్ కు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1857 తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి భారతదేశ పరిపాలనను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో భారతదేశం మొదటి బడ్జెట్ 1860లో సమర్పించింది. స్వతంత్ర భారతదేశంలో మొదటి బడ్జెట్ 1947 నవంబర్ 26న వచ్చింది.


దశాబ్దాల ప్రయాణంలో బడ్జెట్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం బడ్జెట్ పేపర్ లెస్, డిజిటల్ గా మారింది. కానీ.. ఇన్నాళ్లయినా.. ఎన్నేళ్లయినా మారని ఒక అంశం ఒకటి ఉంది. అదే బడ్జెట్ అర్థం. బడ్జెట్ అంటే ప్రభుత్వ ఆదాయాలు, ఖర్చుల లెక్క చూడాలి మరి.. ఈ ఏడాది బడ్జెట్ లో ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారో..!!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 03:50 PM