Home » Nirmala Sitharaman
ఈనెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో విపక్ష పాలిత రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ఏ రాష్ట్రానికి కూడా నిధులు నిరాకరించలేదని చెప్పారు.
స్మార్ట్ సిటీ మిషన్ కింద ఎంపికైన గ్రేటర్ వరంగల్, కరీంనగర్‌లకు రూ. వెయ్యి కోట్లు కేటాయించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల సహాయ మంత్రి టోకన్ సాహు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
పరిశోధనలు, ఆవిష్కరణలు, అభివృద్ధికి దోహదపడేలా బెంగళూరుకు భారీగా లబ్ధి చేకూరనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
'వాల్మీకి కుంభకోణం'లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడిక్కడ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గిరిజన వాల్మీకి కమ్యూనిటీ సొమ్ములను దారి మళ్లించడమేనా మీరు చెప్పే న్యాయం? అని నిలదీశారు.
'నీతి ఆయోగ్' సమావేశం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ తప్పుపట్టడంపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ''సమావేశంలో మీరు లేనే లేరు...ఎలా తప్పుపడతారు?'' అని జైరామ్ రమేష్‌ను ప్రశ్నించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన 'నీతి ఆయోగ్' సమావేశంలో తాను మాట్లాడుతుండగా 'మైక్' కట్ చేశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ఆరోపణల్లో నిజం ఎంత? ఇందులో ఎంతమాత్రం నిజం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మమత వ్యాఖ్యలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ సైతం నిర్ధారించింది.
గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు వరద ప్రభావానికి లోనయ్యాయని ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందన్నారు.
కేంద్ర బడ్జెట్ విపక్షాపూరితంగా ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. విపక్షాలు 'దారుణమైన ఆరోపణలు' చేస్తున్నాయని విరుచుకుపడ్డారు.
కేంద్రపభుత్వం రూ.48,20,512 కోట్లతో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రైతులు, యువత, మహిళలు, పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించింది.
జూలై 23 వ తేదీన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే బడ్జెట్ కంటే ఎక్కువగా నిర్మలా సీతారామన్ సింప్లిసిటీ గురించే సర్వత్రా చర్చ జరుగుతోంది .