Share News

Kunal Kamra: నిన్న షిండే.. నేడు నిర్మలా సీతారామన్.. మరో వివాదంలో కునాల్ కమ్రా

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:04 PM

మహారాష్ట్రి డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలిచాడు కమెడియన్ కునాల్ కమ్రా. అతడిపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు నోటీసులు జారీ చేసినా అతడు తన వైఖరిని మార్చుకోవడం లేదు. పైగా ఈ సారి ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని టార్గెట్ చేస్తూ సెటర్లు వేశాడు.

Kunal Kamra: నిన్న షిండే.. నేడు నిర్మలా సీతారామన్.. మరో వివాదంలో కునాల్ కమ్రా
Kunal kamra

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వివాదానికి తెర తీశాడు స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా. ఇప్పట్లో ఈ వివాదం ముగిసే సూచనలు కనిపించడం లేదు. పైగా కునాల్ కమ్రానే దాన్ని మరింత పెద్దదిగా చేస్తున్నాడు. షిండే వివాదం కొనసాగుతుండగానే.. దాన్ని మరింత పెంచేలా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కమ్రా. ఈ సారి ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక విధానాలను టార్గెట్ చేస్తూ.. ఓ పేరడీ పాటను పోస్ట్ చేశాడు. ఆ వివరాలు..


తాజా పోస్ట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విధానాలపై సెటైర్లు వేస్తూ.. హవా హవాయి పాటకుపేరడీని పోస్ట్ చేశాడు కునాల్. 1987లో విడుదలైన మిస్టర్ ఇండియా సినిమాలోనిది ఈ పాట. అయితే కునాల్ పోస్ట్ చేసిన వీడియో నెల రోజుల క్రితం ఖర్ కామెడీ క్లబ్‌లో రికార్డ్ చేసిన వీడియో.

తాజాగా కునాల్ కమ్రా ఈ వీడియోను రీపోస్ట్ చేస్తూ.. పాప్‌కార్న్ ఎమోజీలను యాడ్ చేశాడు. ఇది మరోసారి వివాదానికి కేంద్ర బిందువయ్యింది. కారణం ఏంటంటే.. గతేడాది నిర్మలా సీతారామన్.. మూవీ థియేటర్లలో అమ్మే పాప్‌కార్న్ మీద వేర్వేరు రకాల జీఎస్‌టీ విధించిన సంగతి తెలిసిందే. దాన్ని గుర్తు చేస్తూ.. కునాల్ ఈ వీడియోని పోస్ట్ చేశాడు.


దీనిలో అతడు నిర్మలా సీతారామన్‌ని ఉద్దేశించి.. సారీవాలి దీదీ, నిర్మలా తాయి అని సంబోధించాడు. దీనిలో అతడు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాడు. ముంబై గతుకుల రోడ్లు మొదలు.. మెట్రో నిర్మాణం వివాదం, బ్రిడ్జీ కూలిన ఘనటల మీద తనదైన శైలీలో సెటర్లు వేశాడు. అలానే కార్పొరేట్ ఉద్యోగులు భారీ ఎత్తున పన్ను చెల్లిస్తారని.. కానీ కార్పొరేషన్లు మాత్రం.. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించవంటూ సెటైర్లు వేశాడు. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ పన్ను విధింపు అంశాల మీద తనదైన శైలీలో సెటైర్లు వేశాడు. పన్నుల మీద వచ్చే ఆదాయం అంతా వృథా అవుతుందని చెప్పుకొచ్చాడు.


షిండేపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తాను ఎవరికి క్షమాపణ చెప్పనని.. షిండే విషయంలో అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలనే తాను కూడా వాడానని తెలిపాడు. ఒకవేళ ఈ అంశంలో న్యాయస్థానం తన వ్యాఖ్యలను తప్పు పట్టి.. క్షమాపణలు కోరమని అడగమని.. అప్పుడు తాను క్షమాపణలు చెబుతానని కునాల్ క్రమా స్పష్టం చేశాడు.


ఇవి కూడా చదవండి:

యూట్యూబ్‌ అంతపని చేసిందన్నమాట.. ఏం జరిగిందో తెలిస్తే..

చోరీ చేయడంలోనూ భార్యకు ట్రైనింగ్.. చివరకు ఇద్దరూ కలిసి..

Updated Date - Mar 27 , 2025 | 01:14 PM