Home » Nitin Jairam Gadkari
నేటి నుంచి 18 వ పార్లమెంట్ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల తొలిరోజే దాదాపు 280 మంది లోక్‌సభ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.00 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేక సెషన్ కావడంతో క్వశ్చన్ అవర్ లేదా జీరో అవర్ ఉండదు. సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తొలుత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు.
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీలోని గడ్కరీ కార్యాలయానికి వెళ్లి కిషన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరించిన నిందితుడు గ్యాంగ్‌స్టర్ జయేష్ పూజారీ.. బుధవారం కోర్టులో పాకిస్థాన్ అనుకూలంగా నినాదాలు చేశాడు. దీంతో అతడిని పోలీసులు బలవంతంగా కోర్టు నుంచి బయటకు తీసుకెళ్లారు.
దేశ ముఖ చిత్రాన్ని మార్చే సత్తా బీజేపీకి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) అన్నారు. గురువారం నాడు జిల్లాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ జరిగింది. ఈ సభలో గడ్కారీ పాల్గొని మాట్లాడుతూ... కాంగ్రెస్ పాలనలో అనేక గ్రామాలు అధ్వాన్నంగా తయారయ్యాయని చెప్పారు.
Telangana: ఢిల్లీ పర్యటన విజయవంతం అయిందని... తెలంగాణ రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు నిధులు కేటాయిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు రోడ్ల భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ పూర్తి అయితే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ 50 శాతం కవర్ అవుతుందని.. హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయిని అన్నారు.
జాతీయరహదారులకు నిధులు కేటాయించాలని కోరానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy ) అన్నారు. సోమవారం నాడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.
వలసవాద మనస్తత్వం నుంచి విముక్తి పొందాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో RSS విజయదశమి ఉత్సవం నిర్వహించింది. ఈ ఉత్సవాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మోహన్ భగవత్ పాల్గొన్నారు..
కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు.
మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను పెంచడం ద్వారా రోడ్డు భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ఓ కార్యక్రమాన్ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం ప్రారంభిస్తారు.