Share News

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి అలైన్‌మెంట్‌ ఖరారు

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:13 AM

హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయంలో 50 శాతాన్ని భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.

Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి అలైన్‌మెంట్‌ ఖరారు

  • భూసేకరణ వ్యయంలో 50 శాతం భరించేందుకు తెలంగాణ హామీ: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ వ్యయంలో 50 శాతాన్ని భరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఎంపీలు డీకే అరుణ, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భూసేకరణ వ్యయం పంచుకోవడానికి సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా సంతకం చేయలేదని వివరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి అలైన్‌మెంట్‌ ఖరారైనట్లు తెలిపారు. రూ.34,367.62 కోట్ల అంచనా వ్యయంతో ఆర్‌ఆర్‌ఆర్‌ మంజూరు కోసం తెలంగాణ నుంచి కేంద్రానికి అభ్యర్థన వచ్చినట్లు తెలిపారు.


హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తరభాగానికి గత నెల 18న పర్యావరణ అనుమతులు వచ్చాయని చెప్పారు. హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణాభాగం డీపీఆర్‌ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఇక, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఉత్తర ప్రాంతీయ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌)ను కలుపుతూ గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్ల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలేవీ లేవని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 05:13 AM