Nitin Gadkari: మౌలిక వసతుల అభివృద్ధి దేశానికి ఎంతో కీలకం
ABN , Publish Date - Apr 16 , 2025 | 07:32 AM
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి కీలకమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోజుకు 100 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

రోజుకు 100 కి.మీ చొప్పున హైవేల నిర్మాణం: గడ్కరీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశానికి మౌలిక వసతుల అభివృద్ధి ఎంతో కీలకమైనదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలో రోజుకు 100 కిలోమీటర్ల చొప్పున రహదారుల నిర్మాణం పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం నిర్వహించిన ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్(ఏఐఎంఏ) 10వ జాతీయ నాయకత్వ సదస్సులో మాట్లాడుతూ.. మరో 18 నెలల తర్వాత మన దేశంలో రోడ్లు అమెరికాకన్నా మెరుగ్గా ఉంటాయని చెప్పారు. మరి కొన్నేళ్లలో తన శాఖ ద్వారా 25,000 కి.మీ. రెండు వరుసల, నాలుగు వరుసల రహదారుల నిర్మాణం పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. అందుకు నిధుల కొరత లేదన్నారు.