Home » Nitish Kumar
విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగలడం ఖాయమా?. రెండు రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడవ కీలక నేత కూటమికి గుడ్‌బై చెప్పబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల ముందు యూ-టర్న్ తీసుకొని బీజేపీతో జట్టు కట్టనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
బిహార్‌లో ఆర్జేడీ - జేడీయూ(RJD - JDU) శిబిరంలో లుకలుకలు బయటపడుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చేసిన ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు కేంద్రం భారత రత్న ప్రకటించడాన్ని ప్రశంసిస్తూ సీఎం నితీశ్ కుమార్ కామెంట్స్ చేశారు.
బీహార్ రాజకీయాల్లో మరోసారి అలజడి చోటుచేసుకోనుందా? జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా గవర్నర్‌ను మంగళవారంనాడు కలుసుకోవడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఆర్జేడీకి ఉద్వాసన చెప్పి బీజేపీతో చేతులు కలిపే అవకాశాలున్నాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై సమష్టి పోరాటానికి ఏర్పడిన 'ఇండియా' కూటమికి కన్వీనర్‌గా వ్యవహరించేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిరాకరించారు. ఈ పదవిని కాంగ్రెస్‌కు చెందిన వేరెవరికైనా అప్పగించాలని నితీష్ సూచించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'ఇండియా' కూటమి వర్చువల్ సమావేశం శనివారం మధ్యాహ్నం జరిగింది.
అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ హాజరవుతారా లేదా అనే విషయంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే 'ఇండియా' కూటమి ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ అగ్రనేతలైన సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి వెళ్లడం లేదని ప్రకటించింది.
విపక్ష కూటమిలో అసంతృప్తులను శాంతపరచడం ద్వారా రాహుల్ గాంధీ చేపట్టనున్న ''భారత్ న్యాయ్ యాత్ర'' కు లైన్ క్లియర్ చేసేందుకు ''ఇండియా'' కూటమి కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ ను కూటమి కోఆర్డినేటర్ గా నియమించే అవకాశం ఉంది.
జనతా దళ్ యునైటెడ్ అధ్యక్షుడిగా తిరిగి పగ్గాలు చేపట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసే తొలి అభ్యర్థిని ప్రకటించారు. అరుణాచల్ వెస్ట్ పీసీ నుంచి జేడీయూ అభ్యర్థిగా రుహి తంగుంగ్ పోటీ చేస్తారని ఆ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
లోక్ సభ ఎన్నికల తేదీలు దగ్గర పడుతున్న వేళ ఇండియా కూటమి(INDIA Alliance) నేతలు వేగం పెంచారు. కూటమిలో కీలకమైన కన్వీనర్ పోస్ట్ ని బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar) కి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నితీశ్ నాయకత్వానికి ఇప్పటికే పలువురు నేతలు సమ్మతి తెలిపారు.
విపక్ష ఇండియా కూటమిపై జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాల నడుమ కూటమి వర్చువల్ మీట్ ఈనెల 3న జరుగనుంది. ఈ సమావేశంలో నితీష్ కుమార్ పేరును కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రతిపాదించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా బ్లాక్‌లో తొలి కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కూటమిలో కీలక బాధ్యతలను బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమర్ కు అప్పగించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆసక్తికరంగా కొద్ది రోజుల క్రితం వరకూ కూటమి తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వచ్చాయి.