Home » Nizamabad
ఉద్యోగులు, మధ్యతరగతి వారి కోసం నగరాన్ని ఆనుకుని ఉన్న మల్లారంలో లేవుట్ను అభి వృద్ధి చేశామని, వచ్చే నెల 14న వేలం పాట నిర్వహించి ప్లాట్ల కేటాయింపు చేస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
మండలంలోని తొర్తి గ్రామానికి చెందిన బీపీఎం సుకన్య సమృద్ధి యోజన పథకానికి సంబంధించిన ఖాతాదారుల నగదును తన సొంతానికి వాడుకోవడంపై ‘ఆంధ్ర జ్యోతి’లో ప్రచురితమైన ‘పక్కదారి పడుతున్న సుకన్య యోజన పథకం’ అన్న కథనానికి జిల్లా త పాలా శాఖ అధికారులు స్పందించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఏపీవోలను ఆదేశించారు.
జిల్లాలోని ప్రధాన పార్టీల నేతలపై మునుగోడు ఉప ఎన్నిక ప్రభావం పడింది.
వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన జిల్లాకు చెందిన ఆదర్శ రైతు చిన్ని కృష్ణుడు సూర్యుడి ఆకారంలో 24 వరి వంగడాలను నాటారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అన్ని మండలాల పరిధిలో ధాన్యం నిల్వలకు అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరి జీవితంలో బాల్యం ఎంతో మధురమైన ఘట్టమని, అందమైన బాల్యాన్ని స్వేచ్ఛగా ఆస్వాదించేలా చూడాల్సిన బాధ్యత సమాజంలో ఉన్న ప్రతిఒక్కరిపై ఉందన్నారు.
జిల్లాలోని గ్రామ పంచాయతీలకు నిధులు రాక.. వేతనాలు లేక అభివృద్ధి కుంటుపడిపోతోంది. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ఆలస్యం కావడం వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగలో పేకాట రాయుళ్లు త మ జోరును కొనసాగించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించారు.