Home » Notice
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(AP Congress Party)లో వివాదం రోజురోజుకి ముదురుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్ఠానం నుంచి వచ్చిన నిధుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా(Sharmila), ఏపీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డి ఆరోపణలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ(YSRCP Govt) నిర్వాకంతో ప్రస్తుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్(Neerabh Kumar Prasad) కు జాతీయ ఎస్టీ కమిషన్(National ST Commission) నోటీసులు జారీ చేసింది. జగన్(Jagan) ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన జాతీయ ఎస్టీ కమిషన్.. పోలవరం నిర్వాసితుల పునరావాసం విషయంపై అప్పట్లోనే జగన్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
బాపట్ల జిల్లా: పట్టణంలో వైసీపీ జిల్లా కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ పేరుతో నోటీసులు జారీ చేశారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో నోటీసును ఆఫీస్ గోడకు మున్సిపల్ సిబ్బంది అంటించారు. అలాగే సిబ్బంది మోపిదేవికు రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపించారు.
రామగుండం ఎన్టీపీసీ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ తరలింపులో అక్రమాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. లారీల నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ కమిషన్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్గా తీసుకున్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తన లాయర్ ఈటోరు పూర్ణచందర్ రావు తరఫున లీగల్ నోటీసులు పంపించారు.
మాజీ సీఎం జగన్ నోరు విప్పితే పచ్చి అబద్ధాలు చెబుతారని మరోసారి తేలింది. తాడేపల్లి బోటుయార్డులోని రూ.కోట్ల విలువైన భూమిలో జల వనరుల శాఖ అనుమతి లేకుండా.. సీఆర్డీఏ, తాడేపల్లి-మంగళగిరి కార్పొరేషన్ల నుంచి పర్మిషన్ తీసుకోకుండా వైసీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని అధికారులు కూల్చివేయడంపై
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై ఎల్ నరసింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ను వివరణ కోరింది. దీంతో ఆయన నిర్ణయంపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్కు కమిషన్ నోటీస్ జారీ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో బ్యారేజీల నిర్మాణంపై విచారణ ఊపందుకుంది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్దమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు.
ఛత్తీసగఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం అంశాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. ‘రికార్డులను పరిశీలిస్తుంటే ఆ నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఆయా అంశాల్లో మీ పాత్రపై లిఖితపూర్వకంగా వివరాలు అందించాలి’ అని పేర్కొంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బిగ్ షాక్ తగిలింది..
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.