Home » Notice
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారం వెనుక బీఆర్ఎస్ కీలక నేత ఒకరు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పశ్చిమ మండలం పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 8వ నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం అనుమతించింది.
బహిరంగ ప్రసంగాల్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం ) కీలక సూచన చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రాహుల్ గత ఏడాది ''పనౌటి'' (చెడు శకునం), పిక్‌పాకెట్ అని సంబోధించారు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు మార్చి 1న ఈసీ తాజా సూచనలు చేసింది.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత జైరామ్ రమేష్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి లీగల్ నోటీసు పంపారు. తన ఇంటర్వ్యూను వక్రీకరిస్తూ 19 సెకన్ల వీడియోను 'ఎక్స్'లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోస్ట్ చేసినందుకు ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నాయకుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్‌కు కాంగ్రెస్ లీగల్ నోటీసు పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ నాయకుల నుంచి బెంజ్ కారు లబ్ది పొందినట్లు ప్రభాకర్ ఆరోపణలు చేశారు.
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దూరంగా ఉంటున్నారు. సోమవారం ఆయన ఈడీ విచారణకు హాజరు అవుతారా? లేదా అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. మద్యం విధానం కేసు దర్యాప్తులో ఈరోజు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు పంపింది.
మంచిర్యాల: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటీవల బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేస్తూ.. విచారణకు రావాలని ఆదేశించారు.
అయోధ్య రామమందిర్ ప్రతిష్ఠాపన వేడుక సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయడంపై ఎలాంటి మౌఖిక సూచనల ఆధారంగా కాకుండా చట్ట ప్రకారం నడుచుకోవాలని తమిళనాడు అధికారులను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం స్పందించి క్లారిటీ ఇచ్చింది.
అమరావతి: ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్లపై సీఎం జగన్ బొమ్మ, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడంపై ప్రభుత్వానికి హై కోర్టు నోటీసులు ఇచ్చింది. సర్టిఫికెట్లపై సీఎం బొమ్మలు వేయడాన్ని సవాల్ చేస్తూ...
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ భవన్‌కు రెవెన్యూ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయంలో టీ న్యూస్ ఛానల్ నిర్వహించడంపట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఈ మేరకు నోటీసులు ఇచ్చారు.