Share News

Kejriwal: ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్?

ABN , Publish Date - Feb 26 , 2024 | 10:19 AM

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దూరంగా ఉంటున్నారు. సోమవారం ఆయన ఈడీ విచారణకు హాజరు అవుతారా? లేదా అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. మద్యం విధానం కేసు దర్యాప్తులో ఈరోజు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు పంపింది.

Kejriwal: ఈడీ విచారణకు దూరంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్?

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ (CM Kejriwal) దూరంగా ఉంటున్నారు. సోమవారం ఆయన ఈడీ విచారణకు హాజరు అవుతారా? లేదా..? అన్న విషయంలో ఉత్కంఠ నెలకొంది. మద్యం విధానం కేసు దర్యాప్తులో ఈరోజు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు పంపింది. కాగా ఇప్పటి వరకు మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఏడు సార్లు నోటీసులు ఇచ్చింది.

ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ పంపిన సమన్ల ప్రకారం కేజ్రావాల్ సోమవారం (19వ తేదీ) విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ ఆయన విచారణకు హాజరుకాలేదు. కేజ్రీవాల్ ఈడీ విచారణకు డుమ్మా కొట్టడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్న సమయంలో సమన్లు పంపడం చట్టు విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ వేచిచూడాల్సిందే అని పేర్కొంది. కాగా ఈడీ పంపిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పలు కారణాలతో విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది.

Updated Date - Feb 26 , 2024 | 10:58 AM