Congress: బీజేపీ నేతకు లీగల్ నోటీసు పంపిన కాంగ్రెస్
ABN , Publish Date - Feb 27 , 2024 | 07:48 AM
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నాయకుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్‌కు కాంగ్రెస్ లీగల్ నోటీసు పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ నాయకుల నుంచి బెంజ్ కారు లబ్ది పొందినట్లు ప్రభాకర్ ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నాయకుడు (BJP Leader) ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar)కు కాంగ్రెస్ (Congress) లీగల్ నోటీసు (Legal Notice) పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ (Dipadas Munshi) కాంగ్రెస్ నాయకుల నుంచి బెంజ్ కారు లబ్ది పొందినట్లు ప్రభాకర్ ఆరోపణలు చేశారు. ఏలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడంపై దీపాదాస్ మున్షీ స్పందించారు. తనపై చేసిన ఆరోపణలపై రెండు రోజుల్లో ఆధారాలు చూపించాలని లేని పక్షంలో 10 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తానని ఎన్విఎస్ఎస్ ప్రభాకర్‌కు దీపాదాస్ మున్షీ హెచ్చరించారు.