Home » NRI News
కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా (Kingdom of Saudi Arabia) డొమెస్టిక్ వర్క్ వీసా పొందేందుకు కొత్త కండీషన్ తీసుకొచ్చింది. పెళ్లికాని సౌదీ పౌరులు విదేశీ గృహ కార్మికులను నియమించుకోవాలంటే ఇకపై వర్క్ వీసా పొందాలంటే 24 ఏళ్లు నిండి ఉండాలనే షరతు విధించింది.
గల్ఫ్ కార్మికులను మోసం చేసింది బీజీపీ పార్టీనే అని ఎన్నారైలు ఫైర్ అయ్యారు. ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు సతీష్ రాదారపు మాట్లాడుతూ, కోరుట్ల నియోజకవర్గంలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లిన కుటుంబాలు చాలా ఉన్నాయి.
Indian Nurse Sentenced To Death In Yemen: భారతీయ నర్సుకు యెమెన్ (Yemen) ఉరిశిక్ష విధించింది. యెమెన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో కేరళ (Kerala) కు చెందిన నిమిషా ప్రియా (Nimisha Priya) అనే నర్సుకు ఆ దేశంలో మరణశిక్ష పడింది. 2017 నుంచి యెమెన్ జైలు శిక్ష అనుభవిస్తుంది. హత్య నేరానికి గాను 2018లో అక్కడి సుప్రీంకోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా సౌదీ అరేబియా (Saudi Arabia) కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఈ మేరకు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Public Prosecution) ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాలపై తాజాగా కీలక ప్రకటన చేసింది.
అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా.
గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయ కార్మికుల్లో అగ్రస్థానంలో ఉండే కేరళ ఇప్పుడు వెనకబడి పోయింది. ఆ స్థానాన్ని ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు ఆక్రమించాయి.
సౌతాఫ్రికాలోని ఎన్నారైలు ఆ దేశానికి తొలి భారతీయుల (Indians) రాకను సెలబ్రేట్ చేసుకున్నారు. గురువారం (నవంబర్ 16న) చాలా మంది భారత సంతతికి చెందిన సౌతాఫ్రికా వాసులు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. 1860లో తొలిసారి తమ పూర్వీకులు దక్షిణాఫ్రికాకు వచ్చిన రాకను ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరో భారత సంతతి (Indian Origin) మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అగ్రరాజ్యం అధికార భవనం వైట్‌హౌస్ (White House) గురువారం ప్రకటించింది.
అమెరికాలో తెలుగుజాతి కోసం పని చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా దీపావళి సందర్భంగా చికాగోలో ఉంటున్న తెలుగు కుటుంబాలకు దీపావళి కానుకలు పంపిణీ చేసింది.
గల్ఫ్ దేశం కువైత్ 2023లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic Violations) సంబంధించి జరిమానాల రూపంలో ఏకంగా 66 మిలియన్ దినార్లు (రూ. 1780కోట్లు) వసూలు చేసింది. ఈ మేరకు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లోని ట్రాఫిక్ ఉల్లంఘనల పరిశోధన విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ముహమ్మద్ సాద్ అల్-ఒటైబీ వెల్లడించారు.