Home » NTR District
జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ (Budawada) లోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ (Ultratech cement factory)లో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.
Andhrapradesh: నిరు పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వలాభాలకు ఉపయోగించుకుంటున్నారు. అనేక విధాలుగా రేషన్ అక్రమ రవాణాలకు అధికారులు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఎక్కడో చోట బియ్యం అక్రమ తరలింపులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేట జాతీయ రహదారిపై వెనుగంచి ప్రోలు మండల పరిధిలో నవాబు పేట వద్ద బొగ్గులోడు లారీలో అను మానాస్పద స్థితిలో ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి నుంచి జగ్గయ్యపేటకు లారీ బొగ్గు లోడుతో బయలుదేరింది. లారీ డ్రైవర్ కనగాల అప్పారావు (50) మిత్రులు ఇద్దరు ఆయనతోపాటు జగ్గయ్యపేటకు లారీలో వస్తున్నారు.
ఈ మధ్య టీవీ చూస్తుంటే... ‘మహానాడు వాయిదా’ అని ఒక వార్త కనిపించింది. ‘మహానాడు’ గురించి... తెలుగుదేశాన్ని స్థాపించిన ఎన్టీఆర్ గురించి ఆ వార్తలో విశేషాలు చెప్పటం మొదలుపెట్టారు.
కృష్ణా జిల్లా: అవనిగడ్డలో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున కార్దన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్నికల అనంతరం హింస నివారణలో భాగంగా లంకమ్మ మాన్యం కాలనీలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Andhrapradesh: ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీసు యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉందని సీపీ పీహెచ్డీ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలు బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూంలకు రెండు కిలోమీటర్ల దూరం వరకూ రెడ్ జోన్ ఉందన్నారు.
నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగు వద్ద ముంబాయి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది.
ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్ జిల్లా): రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు దృష్టిలో పెట్టుకుని, ఇబ్రహీంపట్నంలో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండటంతో పెట్రోల్ బంక్లలో లూజ్ పెట్రోల్ పోయడాన్ని పోలీసులు నిలిపివేశారు. ఈసీ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల యాజమాన్యంతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు.
పెళ్లైన నాటి నుంచి కష్టసుఖాల్లో ఒకరికి ఒకరుగా ఉన్న ఆ దంపతులు చివరికి చావులోనూ ఒక్కటిగానే ఉన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్తూరు సూర్యనారాయణ(92), రుక్మిణీ(86) అనే దంపతులు దుర్మరణం చెందారు. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన ఘటనలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా వారితో పాటు ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Andhrapradesh: జిల్లాలోని విజయవాడ పార్లమెంటు , ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూమ్లోకి తరలించారు. ఈ సందర్భంగా నోవా, నిమ్రా కాలేజీల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్ ఢిల్లీరావు పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. 27 స్ట్రాంగ్ రూంలు 4 బిల్డింగులలో ఏర్పాటు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరుగుతుందన్నారు.