Unseasonal Rains Damage: చేతికొచ్చిన పంట నేలరాలింది.. అన్నదాత కంట కన్నీరు
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:18 AM
Unseasonal Rains Damage: అకాల వర్షాలు రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. చేతికొచ్చిన పంట నేలరాలడంతో అన్నదాతల బాధ వర్ణణాతీతం. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు వేడుకుంటున్న పరిస్థితి.

ఎన్టీఆర్ జిల్లా, ఏప్రిల్ 14: ఏపీలో అన్నదాతలకు అకాల వర్షాలు (Unseasonal Rains) తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వర్షాలు, వడగండ్ల వానకు భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలతో కూడిన వర్షంతో పంటలు ( Damage Crops) నేలరాలాయి. చేతికొచ్చిన పంట నేలకొరగడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రధానంగా మామిడి, బొబ్బాయి, మొక్కజొన్న పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో భారీ ఈదురు గాలులతో ఆకాల వర్షం పడటంతో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. పగలు ఎండ వేడి సాయంత్రం గాలి దుమ్ములతో ప్రజానీకం తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి. ఈదురు గాలులకు పలు చోట్ల భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. తిరువూరు పట్టణంలో గాలులకు హార్డింగ్‌లు, కరెంటు స్థంబాలు నేలకొరిగాయి. తిరువూరు పట్టణంలో రాత్రి నుంచి కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి తిరువూరు మార్కెట్ యార్డ్‌లో 1000కి పైగా ధాన్యం బస్తాలు తడిసిముద్దయ్యాయి. ఆరుగాలం కష్టంచి పండిన ధాన్యం తడవటంతో తీవ్ర నష్టం వాటిల్లింది అని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే
తిరువూరు నియోజకవర్గంలో ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. మామిడి, బొబ్బాయి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన మొక్కజొన్న, బొబ్బాయి,మామిడికాయలు నెలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టామని వరి పంట చేతికొచ్చిన సమయంలో పంట నష్టం జరగడంతో తీవ్రంగా నష్టపోయామని రైతుల ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి తమకు నష్ట పరిహారం అందచేయాలని రైతులు కోరుతున్నారు.
ఇటు తెలంగాణలోనూ రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. వరంగల్, జనగామ, సమీప గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈ వర్షాని వడగళ్ల వాన ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా మామిడి రైతులు అయితే తీవ్రంగా నష్టపోయారు.
ఇవి కూడా చదవండి
భార్యపై భర్త ఘాతుకం.. స్కూడ్రైవర్‌తో అతి కిరాతకంగా..
Andhra Pradesh Weather: వానలు.. వడగాడ్పులు
Read Latest AP News And Telugu News