Share News

CM Chandrababu: డబ్బునోళ్లంతా ఆ పని చేయండి.. సీఎం చంద్రబాబు పిలుపు

ABN , Publish Date - Apr 05 , 2025 | 01:53 PM

CM Chandrababu: సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు తెలిపారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పారు. దేశంలో ఉన్న ఏ వ్యక్తీ పేదరికంలో ఉండకూడదని అన్నారు. దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు.

CM Chandrababu: డబ్బునోళ్లంతా ఆ పని చేయండి.. సీఎం చంద్రబాబు పిలుపు
CM Chandrababu

ఎన్టీఆర్‌: భారత మాజీ ఉప ప్రధానమంత్రి జగ్జీవన్‌రామ్‌ స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ముప్పాళ్లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీ4లో 'మార్గదర్శి-బంగారు కుటుంబం' కింద ఎంపికైన వారిని సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. అందరి ఆలోచనా విధానంలో మార్పు రావాలని సీఎం చంద్రబాబు సూచించారు.


సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించాలని సీఎం చంద్రబాబు అన్నారు. మానవ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పారు. పీ4లో భాగంగా 'మార్గదర్శి-బంగారు కుటుంబం' కింద.. ఏపీలో 20 లక్షల కుటుంబాలను ఎంపిక చేశామని ప్రకటించారు. దేశంలో ఉన్న ఏ వ్యక్తీ పేదరికంలో ఉండకూడదని అన్నారు. దేశంలోనే ఎక్కువ పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.


దీపం-2 కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 30 ఏళ్ల క్రితమే మహిళల కోసం డ్రాక్రా సంఘాలు తీసుకొచ్చానని గుర్తుచేశారు. ఆర్థికంగా పైకి ఎదిగిన వారు.. ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయపడాలని పిలుపునిచ్చారు. అందరికీ సమాన అవకాశాల కోసమే పీ4 విధానమని స్పష్టంచేశారు. గతంలో పీ3 విధానం వల్ల రోడ్లను బాగుచేసుకున్నామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి పోయిందని ఆరోపించారు. తమది మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. అట్టడుగున ఉన్నవారికి చేయూత అందించాలని సీఎం చంద్రబాబు చెప్పారు.


ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం అందజేస్తామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. జనాభా పెరుగుదల అత్యంత ముఖ్యమని చెప్పారు. దేశంలో ఉన్న ఏ వ్యక్తీ పేదరికంలో ఉండకూడదని తెలిపారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్‌ అగ్రగామిగా నిలుస్తుందని తెలిపారు. దేశంలో రెండోతరం సంస్కరణలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని చెప్పారు. నాయకుడు దూరదృష్టితో ఆలోచిస్తేనే సమాజం బాగుపడుతుందన్నారు. ఏపీలో సంపద సృష్టించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సంపద సృష్టించి పేదలకు పంచుతామని అన్నారు. అందరి భవిష్యత్‌ బాగు కోసమే తమ ఆలోచన అని తెలిపారు. పిల్లలను బాగా చదివిస్తేనే ప్రపంచాన్ని ఏలుతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


అందరి భవిష్యత్‌ బాగు కోసమే తమ ఆలోచన అని సీఎం చంద్రబాబు తెలిపారు. పిల్లలను బాగా చదివిస్తేనే ప్రపంచాన్ని ఏలుతారని అన్నారు. అప్పట్లో కుటుంబ నియంత్రణ పాటించమన్నామని గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలో జనాభా పెరుగుదల అవసరమని తెలిపారు. లేకుంటే భవిష్యత్‌లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇదే సమస్యగా మారిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Axis Power Deal: జగన్‌ బాటలోనే చంద్రబాబు

YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ

Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్‌

For More AP News and Telugu News

Updated Date - Apr 06 , 2025 | 10:42 AM