CM Chandrababu:ఎన్టీఆర్ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Apr 05 , 2025 | 07:06 AM
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు శనివారం నాడు బిజీబిజీగా ఉండనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది.

అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇవాళ(శనివారం) పర్యటించనున్నారు. ఉదయం 10:15గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలీకాప్టర్‌లో ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం, ముప్పాళ్ల గ్రామానికి చేరుకుంటారు. స్థానిక ప్రజాప్రతినిధులతో 10:30కు సమావేశం అవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 11 గంటలకు డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకులం రెసిడెన్షియల్ పాఠశాల, ముప్పాళ్లను సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు.
12 గంటలకు ముప్పాళ్ల నిమ్మ తోటలో ఏర్పాటుచేసిన ప్రజా వేదిక వద్దకు సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అక్కడ బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను సీఎం చంద్రబాబు పంపిణీ చేయనున్నారు. పాదరక్షల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేసి, అక్కడే ప్రజలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు ముప్పాళ్ల వేబ్రిడ్జి సైటుకు సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. తిరిగి నాలుగు గంటలకు చందర్లపాడు మండలం, ముప్పాళ్ల గ్రామానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Axis Power Deal: జగన్ బాటలోనే చంద్రబాబు
YS Sharmila vs Jagan: మోసగాడు ఈ మేనమామ
Kasireddy Rajasekhar Reddy: కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టు షాక్
For More AP News and Telugu News