Home » NTR District
ఎన్టీఆర్ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ డిల్లీరావు(Dilli Rao) తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. ఎన్నికల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల పరిశీలన అధికారి మోహన్ వచ్చారని చెప్పారు.
Andhrapradesh: విజయవాడ, మే 11: మే 13న ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, మాక్ పోలింగ్‌కు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు. రేపు(ఆదివారం) పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందన్నారు.
Andhrapradesh: ఎన్నికలకు మరికొద్దిరోజులే ఉన్నప్పటికీ వైసీపీలో మాత్రం వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కేశినేని శివనాథ్(చిన్ని) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరపు జగన్మోహన్ రావు టీడీపీలో చేరారు.
Andhrapradesh: కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ వసంత కృష్ణప్రసాద్ ముందుకు సాగుతున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో భాగంగా ఎన్నికల సంఘం (Election Commission) నామినేషన్లను స్వీకరిస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో రెండో రోజు మొత్తం 18 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.ఢిల్లీరావు తెలిపారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి మూడు నామినేషన్లు దాఖలు అయినట్లు చెప్పారు.
Andhrapradesh: మరికొద్దిరోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. అధికార పార్టీ, టీడీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, ముఖ్యనేతలు బయటకు అడుగులు వేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో విజయవాడ రూరల్ రామవరప్పాడు శివారు నెహ్రూ నగర్ కట్టపై ఎన్డీయే కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. ఆయన ఎక్కడికి వెళ్లినా మహిళలు హారతులతో స్వాగతం పలుకుతున్నారు.
Andhrapradesh: జిల్లాలోని నందిగామలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తపై వైసీపీ మూకలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యేను ప్రశ్నించిన పాపానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆస్పత్రి పాలయ్యాడు. ప్రచారంలో ఎమ్మెల్యే ఉండగానే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ మూకలు విచక్షణారహితంగా దాడి చేశారు.
Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగదు తరలింపులపై పోలీసులు దృష్టిసారించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో చెక్ పోస్టులు వద్ద శనివారం అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న కోటి రూపాయల వరకు నగదు పట్టుబడటంతో కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా ప్రత్యేక దృష్టి సారించారు.
Andhrapradesh: మరో నెలన్నరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల తేదీ కూడా వచ్చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ పార్టీ ప్రచారానికి సిద్ధమవుతోంది. రెండో సారి విజయం తమదే అన్న ధీమాలో వైసీపీ నేతలు ఉన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. నందిగామలో వైసీపీ కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.