Home » Nuzvid
నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా నిన్న పెద్దఎత్తున కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంపై తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నూజివీడు(Nuziveedu) మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల మధ్య నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని అర్ధరాత్రి 2గంటల సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. సమీపంలోని పామాయిల్ తోటలోకి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ (YSR Congress).. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలుపుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితి.! ఎందుకంటే.. ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం, 11 పరిమితమవ్వడంతో ఎప్పుడు ఏ ఎమ్మెల్యే వైసీపీని వీడి.. టీడీపీలో (Telugu Desam) చేరతారో తెలియట్లేదు...
నూజివీడు ట్రిపుల్ ఐటీ ఉద్యోగుల నిరసనతో క్యాంపస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుగా జీతాలు పెంచకుండా తమను వేధించారంటూ ఆర్జీయుకేటీ ఛాన్స్‌లర్ కె.సి.రెడ్డిని (RGUKT Chancellor KC Reddy) యూనివర్శిటీలోకి రానివ్వకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ(AP Assembly), లోక్ సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బెట్టింగ్(Betting) విపరీతంగా సాగింది. కోట్ల రూపాయలు చేతులు మారాయి. బెట్టింగ్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏపీఎల్. కానీ రాష్ట్రంలో దాన్ని మించి ఎన్నికల వేళ పందాలు వేసి బికారులుగా మారుతున్నారు. మరికొంత మంది సొమ్ము చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
వైసీపీ నేత జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (Venugopal Reddy) అనుమానాస్పద మృతి నూజివీడులో కలకలం రేపింది. దీంతో నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తూర్పుదిగవల్లిలో కోళ్లఫారం షెడ్‌లో వేణుగోపాల్ రెడ్డి మృతదేహం లభించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది...
నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ సామాగ్రి వేలంకు నూజివీడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో చర్చించి వేలాన్ని నిలుపుదల చేసేందుకు నూజివీడు ఆర్డీవో ప్రయత్నాలు చేస్తున్నారు. నూజివీడు జమిందారీ వంశీకులైన మేకా రాజ్యలక్ష్మి తాయారమ్మకు చెందిన స్థలం వేలంలో ఉంది.
నూజివీడు ( Nujiveedu ) లో వైసీపీ ( YCP ) కౌన్సిలర్లు రెచ్చిపోతున్నారు. నూజివీడు పోలీసులను వైసీపీ రౌడీలు పరుగులు పెట్టిస్తున్నారు. ఫ్లెక్సీల అంశంలో మేకల అనిల్, రామగిరి రాంబాబు మధ్య వార్ నడుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య రాజీ కోసం పంచాయితీ పెట్టారు. ఇందులో ఇరువర్గాల కౌన్సిలర్ల అనుచరులు మరోసారి దాడులకు పాల్పడ్డారు.
Andhrapradesh: నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరెంట్ లేక 24 గంటలుగా 6వేల మంది విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుoటున్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీ(Nujiveedu Triple IT)లో ఐదువేల మంది విద్యార్థులు ఆకలి కేకలతో ఇబ్బంది పడుతున్నారు. నాసిరకం భోజనం పెడతున్నారని 5వేల మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు.