Nuzvid IIIT: నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఛాన్స్‌లర్ కె.సి.రెడ్డిని అడ్డుకున్న ఉద్యోగులు
ABN , Publish Date - Jun 13 , 2024 | 02:47 PM
నూజివీడు ట్రిపుల్ ఐటీ ఉద్యోగుల నిరసనతో క్యాంపస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుగా జీతాలు పెంచకుండా తమను వేధించారంటూ ఆర్జీయుకేటీ ఛాన్స్‌లర్ కె.సి.రెడ్డిని (RGUKT Chancellor KC Reddy) యూనివర్శిటీలోకి రానివ్వకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు.
ఏలూరు: నూజివీడు ట్రిపుల్ ఐటీ ఉద్యోగుల నిరసనతో క్యాంపస్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లుగా జీతాలు పెంచకుండా తమను వేధించారంటూ ఆర్జీయుకేటీ ఛాన్స్‌లర్ కె.సి.రెడ్డిని(RGUKT Chancellor KC Reddy) యూనివర్శిటీలోకి రానివ్వకుండా ఉద్యోగులు అడ్డుకున్నారు. క్యాంపస్‌లోకి రానివ్వకుండా గోబ్యాక్ కె.సి.రెడ్డి అంటూ నినాదాలు చేశారు. ఆయణ్ని, వాహనాన్ని అడ్డుకుని లోపలికి రాకుండా ట్రిపుల్ ఐటీ గేట్ల వద్ద భైఠాయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని మండిపడ్డారు. ఆరు సంవత్సరాల నుంచి జీతాలు పెంచకుండా, ఉద్యోగుల జీవితాలు నాశనం చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. క్యాంపస్ లోపల ఉద్యోగులంతా ఆందోళనకు దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
For more Andhra Pradesh and Telugu news click here..