Home » ODI World Cup
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. టోర్నీ ఆరంభంలో కాస్త బోర్ కొట్టించినప్పటికీ క్రమక్రమంగా ఊపందుకుంది. ఇటీవల పలు ఉత్కంఠభరిత మ్యాచ్‌లతోపాటు సంచలన విజయాలు కూడా నమోదవుతున్నాయి. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టు చిత్తుగా ఓడిపోతుంటే.. అఫ్ఘానిస్థాన్ వంటి చిన్న జట్లు సంచలన విజయాలు సాధిస్తున్నాయి.
భారత్ వేదికా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పసికూనగా టోర్నీలోకి అడుగుపెట్టిన అఫ్ఘానిస్థాన్ జట్టు బలమైన జట్లను ఓడిస్తూ అందరి దృష్టిని తమ వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే ఎవరి అంచనాలకు అందకుండా సెమీస్ రేసులో నిలిచింది.
ప్రముఖ క్రికెట్ స్టేడియం వాంఖడేలో నేడు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. సచిన్ స్టాండ్స్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. సచిన్ ఐకానిక్ షాట్లలో ఒకటైన ఆఫ్‌సైడ్ షాట్ ఆడుతున్నట్టుగా విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జెండాలు కనిపించాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన కొందరు క్రికెట్ అభిమానులు పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ స్టాండ్స్‌లో పాలస్తీనా జెండాలతో కనిపించారు.
వన్డే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ పరాజయాల తర్వాత పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచి ఊరట పొందింది.
కోల్‌కతా వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది.
2003 ప్రపంచకప్‌లో పసికూన కెన్యా ఏకంగా సెమీస్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. కెన్యా తరహాలో ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంకో రెండు అద్భుతాలు చేయాలి.
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ రికార్డు నెలకొల్పాడు. వన్డే క్రికెట్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 51 మ్యాచ్‌ల్లోనే ఆఫ్రిదీ ఈ మార్కు అందుకున్నాడు. దీంతో వేగంగా ఈ మార్కు అందుకున్న పాకిస్థాన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోతుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా నవంబర్ 5న జరిగే ఈ మ్యాచ్‌కు గౌరవ అతిథిగా హాజరుకావాలని హోంమంత్రి అమిత్ షాను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) కోరింది.