PAK Vs BAN: విజృంభించిన పాకిస్థాన్ బౌలర్లు.. 45.1 ఓవర్లలో బంగ్లాదేశ్ ఆలౌట్
ABN , First Publish Date - 2023-10-31T18:11:06+05:30 IST
కోల్‌కతా వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రపంచకప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది.
వన్డే ప్రపంచకప్‌లో వరుస పరాజయాల బాటలో వెళ్తున్న రెండు జట్లు ఈరోజు తలపడుతున్నాయి. ఆ రెండు జట్లు ఉపఖండం జట్లు కావడంతో అభిమానులు ఈ మ్యాచ్‌పై ఆసక్తి చూపుతున్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారడంతో ఫలితంపైనే అందరి దృష్టి పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే పాకిస్థాన్ బౌలర్ షాహిన్ షా అఫ్రిది దెబ్బకు బంగ్లాదేశ్ వరుసగా మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ లిట్టన్ దాస్, అద్భుత ఫామ్‌లో ఉన్న మహ్మదుల్లా వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేయడంతో బంగ్లాదేశ్ ఊపిరి పీల్చుకుంది. లిట్టన్ దాస్ 64 బాల్స్‌లో 45 రన్స్ చేయగా.. మహ్మదుల్లా 70 బాల్స్‌లో 56 రన్స్ చేశాడు. కెప్టెన్ షకీబుల్ హసన్ 43 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ స్కోరు 200 రన్స్ దాటింది.
ఇది కూడా చదవండి: ODI World Cup: కేరాఫ్ సంచలనాలు.. అప్పుడు కెన్యా.. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్..!!
అయితే మహ్మద్ వసీమ్ రాణించడంతో మళ్లీ బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. పాకిస్థాన్ బౌలర్లలో షహీన్ అఫ్రిదికి 3 వికెట్లు, మహ్మద్ వసీమ్‌కు 3 వికెట్లు పడ్డాయి. హరీస్ రౌఫ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఇఫ్తికార్ అహ్మద్, ఉసామా మీర్ తలో వికెట్ తీసుకున్నారు. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిన పాకిస్థాన్ జట్టుకు సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ తప్పకుండా గెలవాలి. పాకిస్థాన్ గెలవాలంటే 205 పరుగులు చేయాలి.