Home » ODI World Cup
IND vs AUS Final: క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగే ఈ ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. లక్ష 30 వేల మంది అభిమానుల కేరింతల మధ్య ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనేక మంది ప్రముఖులు సైతం స్టేడియానికి తరలివస్తున్నారు.
Team India head coach Rahul Dravid: రాహుల్ ద్రావిడ్. క్రికెట్ చూసే వారికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసర లేదు. భారత క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన రాహుల్ ది వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి సమయంలోనైనా వికెట్లకు అడ్డుగోడగా నిలబడి టీమిండియాను అనేక మ్యాచ్‌ల్లో గెలిపించాడు. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రికెటర్ హవా నడుస్తున్న రోజుల్లో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
India vs Australia: క్రికెట్ ప్రేమికులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. తుది పోరులో బలమైన భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడడం ఇదో రెండో సారి. ఈ నేపథ్యంలో 2003 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడిన టీమిండియాకు, ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడబోతున్న టీమిండియాకు ఉన్న తేడాలేంటో ఒకసారి పరిశీలిద్దాం.
మరికాసేపట్లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం అతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది.అసలు టేబుల్‌పై రెండు జట్ల బలబలాలు ఎలా ఉన్నాయి? బలహీనతలేంటి? ప్రపంచకప్ గెలిచే సత్తా ఉన్న జట్టు ఏదనే అంశాలని ఒకసారి పరిశీలిద్దాం.
మరికొన్ని గంటల్లో ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్‌ల్లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. వరల్డ్ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి ఎగరేసుకు పోవాలని ఆస్ట్రేలియా ఉవ్విళ్లూరుతున్నాయి.
World Cup Final: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 10 విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా తుది పోరులోనూ గెలిచి మూడో సారి ప్రపంచకప్ ట్రోఫీని గెలవాలని పట్టుదలగా ఉంది.
ఒకటా...రెండా... మాది పదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ. ఒక్కటైనా ఐసిసి ట్రోఫీ దక్కకుండా పోతుందా అన్న ఎదురు చూపులతో మా కళ్ళు కాయలు కాశాయి. బోలెడంత ఫ్రస్ట్రేషన్, అంతకు మించి...
వన్డే ప్రపంచకప్ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. షమీ 7 వికెట్లతో విజృంభించాడు. దీంతో న్యూజిలాండ్ 327 పరుగులకు ఆలౌటైంది.
Marriage Sentiment: ప్రపంచకప్ ఫైనల్‌కు పెళ్లిళ్లతో ముడిపెట్టిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే పెళ్లిళ్లు చేసుకున్న కెప్టెన్‌లు మరుసటి ఏడాదే ప్రపంచకప్‌లను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది పెళ్లి చేసుకున్న కెప్టెన్ ఈ ఏడాది ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ODI World Cup: ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మెగా ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారు.